Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshప్రారంభమైన *నగరవనం* నిర్మాణం.

ప్రారంభమైన *నగరవనం* నిర్మాణం.

ఎమ్మెల్యే తో వర్చువల్ జంగిల్ సఫారీ ఏర్పాటుకు రంగం సిద్ధంభూమి పరిశీలించన జిల్లా ఫారెస్ట్ అధికారి.. చింతలపూడి పట్టణానికి సమీపంలో పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు వినోదాన్ని అందించేందుకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా నగరవనం నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

పట్టణ శివారు ఫాతిమాపురంలో ఏర్పాటు చేసే నగరవనం లో చేపట్టవలసిన పనులను మంగళవారంఎమ్మెల్యే రోషన్ కుమార్ జిల్లా అటవీ శాఖ అధికారి సందీప్ రెడ్డి తో కలసి క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్చించారు.
నగరవనం స్వాగత ద్వారం ఏర్పాటు ఆకర్షణీయంగా ఉండే విధంగా ఏర్పాటు చేయాలని శాసనసభ్యులు సూచించారు.

నగరవనం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెద్దలకు, పిల్లలకు వినోదంగా ఉండేలా ఏర్పాటు చేయాలని రోషన్ కుమార్ పేర్కొన్నారు
అందర్నీ ఆకర్షించే విధంగా వర్చువల్ జంగల్ సఫారీ,
ప్రకృతి శోభను ప్రతిబింబించే విధంగా ఏర్పాట్లు, సందర్శకులకు అనువైన క్రికెట్ టర్ఫ్ , క్రీడ మైదానం క్యాంటీన్ వంటి వసతి సౌకర్యాలు కల్పించి రాష్ట్రంలో వినూత్న రీతిలో రూపొందించాలని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments