Wednesday, June 10, 2026
HomePoliticsAndhra Pradeshఎం కోడూరు వాసవి వనిత క్లబ్ ఆవిర్భావం

ఎం కోడూరు వాసవి వనిత క్లబ్ ఆవిర్భావం

మాడుగుల మండలం ఎం కోడూరు గ్రామంలో బుధవారం ఎం కోడూరు వాసవి క్లబ్ సౌజన్యంతో వాసవి వనిత క్లబ్ నూతనంగా ఆవిర్భవించింది. క్లబ్బు అధ్యక్షురాలుగా రావాల రామలక్ష్మి, కార్యదర్శిగా రావాల మౌనిక, కోశాధికారిగా మేడిశెట్టి శ్రీకన్య ఎన్నికయ్యారు. వీరి చేత జిల్లా గవర్నర్ పివి రమణమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వాసవి క్లబ్ అంతర్జాతీయ ఉపాధ్యక్షులు వుడా త్రినాధరావు హాజరై సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. అలాగే ఇంకా ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ క్లబ్ మరో ఉపాధ్యక్షుడు యస్ శ్రీను, క్యాబినెట్ సెక్రటరీ పసుమర్తి మల్లికార్జునరావు, క్యాబినెట్ కోశాధికారి సత్య వరపు శ్రీనివాసరావు, రీజనల్ చైర్మన్ వీర్రాజు, రీజనల్ సెక్రెటరీ మేడిశెట్టి జగన్నాథ స్వామి, జోన్ చైర్మన్ పుట్ట మాధవి, ఎం కోడూరు వాసవి క్లబ్ అధ్యక్షుడు మేడిశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ ఏడాది అంతర్జాతీయ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్షేమ సేవా కార్యక్రమాలను జిల్లా గవర్నర్ రమణమూర్తి వివరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు. అలాగే గ్రామ సర్పంచ్ గొల్లవిల్లి సంజీవరావు కూడా హాజరై నూతన పాలకవర్గాన్ని సత్కరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments