Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshబీజేపీ కార్యాలయంలో సమర్పణ దివస్

బీజేపీ కార్యాలయంలో సమర్పణ దివస్

దీన్ దయాల్ కు నివాళులు అర్పించిన మాధవ్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ఏకాత్మతా మానవతా వాదం సిద్దాంతకర్త, భారతీయ జనసంఘ్ పూర్వ అధ్యక్షులు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వర్ధంతిని సమర్పణ దివస్ కార్యక్రమం నిర్వహించి ఆయనకి ఘన నివాళులర్పించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశు రామ రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ హాజరై మాట్లాడుతూ సుఖమంటే ఏమిటో తెలియక కష్టాలనే చవిచూస్తూ దేశ సేవకు నిమగ్నమై,దానినే జీవన కార్యంగా మలచుకున్న పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ సేవలను కొనియాడారు. డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ మరణం తర్వాత జనసంఘ్‌ నామరూపాలు లేకుండా పోతుందని ఆశించిన వారి ఆలోచనలను తలకిందులు చేస్తూ పార్టీని దేశవ్యాప్తంగా పటిష్ఠపరచిన ఘనత దీనదయాళ్‌జీ కి దక్కుతుందన్నారు. బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు పరశు రామ రాజు మాట్లాడుతూ జనసంఘ్‌లో చేరినప్పటి నుంచి మహారథియై పార్టీకి సారథ్యం వహించి, దేశ రాజకీయాలలో జనసంఘ్‌కు ప్రత్యేక స్థానాన్ని కల్పించడంలో కృతకృత్యులై 1967లో పార్టీ అఖిల భారత అధ్యక్షులైన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ కాలికట్‌లో జరిగిన అఖిల భారత జనసంఘ్‌ మహాసభలో భారత దర్శనాన్ని ప్రదర్శింపచేసి విశేష కీర్తి నార్జించారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి నాగేంద్ర, బీజేపీ పార్వతీపురం జిల్లా ఇంచార్జి ప్రకాష్ రెడ్డి, బీజేపీ ఏలూరు జిల్లా ఇంచార్జి బొండాడ నరేంద్ర ప్రకాష్, బీజేపీ మెడికల్ కన్వీనర్ రూపాకుల రవి కుమార్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరంగం ధనేశ్వర రావు, దాడి పురుషోత్తం రమేష్, సిరసపల్లి నూకరాజు, పొలిమేర శ్రీనివాస రావు మరియు అధిక సంఖ్యలో బీజేపీ జిల్లా పదాధికారులు, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని పండిట్ దీన దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి నివాళులర్పించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments