Monday, April 20, 2026
HomePoliticsAndhra Pradeshశరవేగంగా శంఖు చక్ర నామాలు ఏర్పాటు పనులు

శరవేగంగా శంఖు చక్ర నామాలు ఏర్పాటు పనులు

వడ్డాది గిరిజాంబ గిరిపై కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఎల్ఈడీ శంఖు,చక్ర,నామాల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి.ప్రస్తుతం పునాది కాంక్రీట్ వర్క్ జరుగుతోంది. మరో రెండు రోజుల్లో ఇది పూర్తయి ఐరన్ వర్క్ ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు.మంగళవారం జడ్పిటిసి దొండా రాంబాబు నిర్మాణ పనులను పరిశీలించారు. రూ.6లక్షల అంచనా వ్యయంతో కొండపై శాశ్వతంగా శంకు చక్ర నామాలు ఏర్పాటుకు గ్రామ పెద్దలు నిర్ణయించి దాతలు నుండి విరాళాలు సేకరిస్తున్నారు.వచ్చే నెల ఫిబ్రవరి 26 నుండి మార్చి 4వ తేదీ వరకు వెంకటేశ్వర స్వామి 153వ వార్షిక కళ్యాణోత్సవాలు నిర్వహించనున్నారు.ఈ నేపథ్యంలో స్వామివారి కల్యాణోత్సవాలు ప్రారంభానికి ముందే ఇక్కడ శంఖు,చక్ర,నామాలు నిర్మాణం పూర్తి చేసేందుకు వెంకటేశ్వర వర్తక సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు,యువకులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు.శ్రీవారి శంఖు చక్ర నామాలు ఏర్పాటు చేయడం ద్వారా వెంకన్న ఆలయం మరింత ప్రాచుర్యం పొందుతుందని పలువురు భావిస్తున్నారు.ఈ నిర్మాణానికి భక్తుల నుండి ఊహించని విధంగా విశేష స్పందన లభిస్తుందని వర్తక సంఘం సభ్యులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments