మాడుగుల మండలం కిoతలి పొలాల్లో మంగళవారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో ఒక వరికుప్పతోపాటు నాలుగు గడ్డి కుప్పలు కూడా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న మాడుగుల అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. లేనిపక్షంలో మరిన్ని కుప్పలు అగ్నికి ఆహుతి అయ్యే ఉండేవని రైతులకు తెలిపారు. గ్రామానికి చెందిన చంద్రన్న కొండబాబు వరి కు, గడ్డి కుప్ప తో పాటు, పట్నాల తాతబ్బాయి, దేవర కొండ బాబు, పట్నాల అచ్చం నాయుడులకు చెందిన గడ్డి కుప్పలు కూడా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాద సందర్భంగా లక్ష రూపాయల వరకు నష్టం సంభవించినట్టు రైతులు చెబుతున్నప్పటికీ, అగ్నిమాపక సిబ్బంది మాత్రం 60 వేల రూపాయలు నష్టం వాటిలిందని చెప్పారు. గుర్తుతెలియని వ్యక్తులు సిగరెట్ కాల్చి అటుగా పడేయడం వల్ల ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు.
