పీఠాధిపతి – డాక్టర్ ఉమర్ ఆలీషా మానవుడు తాత్విక జ్ఞానం పొందడం వలన జ్ఞాన నేత్రం తెరువబడుతుందని
పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. పిఠాపురం – కాకినాడ రోడ్ నందలి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో 3 రోజులు పాటు జరిగే పీఠం 98వ వార్షిక జ్ఞాన మహా సభలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో పీఠాధిపతి సభలను ప్రారంభించారు. ఈ సందర్భంగా
ఆలీషా మాట్లాడుతూ త్రయీ సాధన అనే ఆధ్యాత్మిక దిక్సూచి ద్వారా మానసిక స్థిరత్వం, ధైర్యం, అలవడి జీవన విధానం సుఖమయం చేసుకోవచ్చునని తెలిపారు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి అంటే ఉద్రేకం అనే అగ్నిని సహనం అనే నీటి ద్వారా చల్లార్చాలని అన్నారు. మానవుడు తనలో అంతర్లీనంగా ఉన్న
జ్ఞాన నేత్రాన్ని గుర్తించగలిగితే తద్వారా
భగవంతుడిని దర్శించవచ్చునని పేర్కొన్నారు. మానవుడిని మహనీయుడిగా మలిచే జ్ఞాననేత్రం పొందడానికి గురుముఖంగా ఆధ్యాత్మిక తాత్వాన్ని గ్రహించాలని తెలిపారు.
అనంతరం నివేదిక 2026, ఉమర్ అలీషా రూరల్ డెవలెప్మెంట్ ట్రస్ట్ మరియు దేవదారు బ్రోచర్ లను పీఠాధిపతి సభలో ఆవిష్కరించారు
ఈ సందర్బంగా తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాసరావు, కాకినాడ జిల్లా డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి అలియాస్ బాబు, వాసిరెడ్డి ఏసుదాస్
ప్రముఖ కవి, రచయిత యామిజాల ఆనంద్, , ప్రముఖ కవి డాక్టర్ శిరీష్, సినీ మాటల రచయిత పోలగాని భాను తేజశ్రీ,యోగభారత్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ జ్యోతుల నాగేశ్వరరావు, భారత్ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ గట్టి శ్రీకృష్ణ దేవరాయలు, ఒ ఎన్ జి సి, ఇంజనీర్ చిన్ని సత్యనారాయణమూర్తి
తదితరులు పీఠాధిపతిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, సెంట్రల్ కమిటీ సభ్యులు, ఎన్టీవీ వర్మ, డాక్టర్ పింగళి ఆనంద కుమార్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
తాత్విక జ్ఞానం ద్వారా జ్ఞాన నేత్రం తెరువబడుతుంది.
RELATED ARTICLES
