Monday, April 20, 2026
HomePoliticsAndhra Pradeshతిరుమల లడ్డు రాజకీయం చంద్రబాబుకు తగదు

తిరుమల లడ్డు రాజకీయం చంద్రబాబుకు తగదు

శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు కలియుగ దైవం మహా పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లడ్డు ప్రసాదం పై జంతు కొవ్వు లు కలిసాయని రాజకీయ దుమారం చేయడం కోట్లాది భక్తుల మనోభావాలను సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా దెబ్బతీశారని టెక్కలి నియోజకవర్గం వైయస్సార్సీపి సమన్వయకర్త పేరాడ తిలక్ విమర్శించారు.

స్వార్థ రాజకీయాలకు శ్రీవారిని వాడుకోవడం తగదని ఇది దుర్మార్గపు చర్యని ధ్వజమెత్తారు, జంతు కొవ్వులు కలిసాయని సమగ్ర ఎన్ డి ఆర్ ఐ, ఎన్ డి డి బి సంస్థల దర్యాప్తులో నిజాలు తేటతెల్లమయ్యాయని అందులో ఎలాంటి కొవ్వు పదార్థాలు లేవని తెలిపాయ అన్నారు, సీఎం తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలని తిలక్ పాత్రికేయుల సమావేశంలో అన్నారు.

హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మము అంటూ అపహాస్యం చేస్తున్న ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని ప్రజలకు భక్తులకు క్షమాపణ చెప్పాలనీ డిమాండ్ చేశారు.

తక్షణమే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళన చేయాలని భక్తులు కోరుతున్నారని, ప్రభుత్వ పాలకులు తప్పుడు ప్రచారాలు, అబద్ధాలు తగ్గించాలని అన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను విఫలమయ్యారని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ప్రజాసంక్షేమానికి కూటమి ప్రభుత్వం సమాయత్తం కావాలని తిలక్ సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments