Monday, April 20, 2026
HomeNewsవంశధార నీళ్లు విడుదలకు మంత్రి ఆదేశం

వంశధార నీళ్లు విడుదలకు మంత్రి ఆదేశం

వేసవి నీటి ఎద్దడికి ముందు జాగ్రత్తలు  చెరువులు నింపండి నీటి వృదా చేయకండి గ్రామీణ ప్రాంతాల నీటి అవసరాలను తీర్చేందుకు రానున్న వేసవి ఎద్దడికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునేందుకు గ్రామాల్లో ఉన్న చెరువులను, కుంటలను వంశధార నది నీళ్ళను నింపేందుకు నీటిని తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు సంబంధిత శాఖలను ఆదేశించారు.

రానున్న వేసవి ఎద్దడికి గాను కేవలం తాగునీరు, పశువులు, మూగజీవాల సంరక్షణకు సంరక్షణకు చెరువుల్లో నింపిన నీటిని వినియోగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవసాయ అవసరాలకు వినియోగించరాదని ఆయన అన్నారు, ఈ మేరకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ రైతులకు నీటి వాడకంపై అవగాహన కల్పించాలని మంత్రి అన్నారు. వంశధార నది వరివాహక ప్రాంతంలోని వేసవి నీటి ఎద్దడి నివారణ కు ఈ నీటిని విడుదల చేస్తున్నామని ప్రజలు వ్యవసాయ అవసరాలకు వంశధార నీటిని వినియోగించరాదని మంత్రి కింజరాపు అచ్చం నాయుడు స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments