ఫిబ్రవరి 12న దేశ వ్యాప్త సమ్మె కు సిద్ధం దేశవ్యాప్తంగా కార్మికుల హక్కులను కాలరాసే లేబర్ కోడ్లను తక్షణమే కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్లతో ఈనెల 12న రాష్ట్రవ్యాప్త సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా పొరబాటకు సిద్ధమవుతున్నాయని సిఐటియు జిల్లా నాయకులు నంబూరు షణ్ముఖరావు పిలుపునిచ్చారు.
లేబర్ కోడ్ల వల్ల కాంట్రాక్ట్ కార్మికులు, కూలీల హక్కులను హరిస్తున్నారని కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని దీన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలన్నీ ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు ఆయన తెలిపారు. ఫిబ్రవరి 12న టెక్కలి పాత బస్టాండ్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు కార్మిక సంఘాల ప్రదర్శన నిర్వహిస్తామని షణ్ముఖరావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ సంఘం ప్రతినిధులు ధవళ లక్ష్మీనారాయణ, బి మల్లయ్య, గ్రానైట్ కార్మిక సంఘం ప్రతినిధులు కే గణేష్ దుర్గాప్రసాద్, అంగన్వాడీల సంఘం బి రవణమ్మ, రోల్ శ్రీదేవి, అన్నేపు సత్యవతి ,ధనలక్ష్మి, వ్యవసాయ సంఘం ప్రతినిధులు బగాధి వాసుదేవరావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
