Saturday, April 25, 2026
HomePoliticsAndhra Pradeshజగత్తంతా జగదీశ్వర స్వరూపమే - ఇదే మనఋషులు మనకందించిన వారసత్వం.

జగత్తంతా జగదీశ్వర స్వరూపమే – ఇదే మనఋషులు మనకందించిన వారసత్వం.

డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే  జగత్తంతయూ జగదీశ్వర స్వరూపమేనని, ప్రతి జీవిపట్ల కరుణాపూరితమైన భావనతో మెదిలినపుడే పరిపూర్ణమైన మానవుడు అవుతాడని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లాశాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకట రెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్బంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా వారు ప్రవచించారు. మూడు రోజులు స్వాత్మానంద సరస్వతి స్వామీజీ చేసిన శ్రీమద్రామాయణ, మహాభారత, భాగవత ప్రవచనాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు సోముల కృష్ణారెడ్డి, గీతా ప్రచారకులు బాణాల లక్ష్మీనారాయణా చార్యులు, స్థానిక అర్చకులు గోసుకొండ రాఘవేంద్ర శర్మ, భక్తమండలి సభ్యులు ఎస్. నారాయణ రెడ్డి, శివరామిరెడ్డి, రామచంద్రారెడ్డి, చెన్నారెడ్డి, రామిరెడ్డి, పుల్లారెడ్డి, శివశంకర్ రెడ్డి, మల్లారెడ్డి, సోముల లక్ష్మీశ్వరమ్మ, లక్ష్మీదేవితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments