Saturday, April 25, 2026
HomePoliticsAndhra Pradeshఆధార్ కేంద్రం ప్రారంభించిన కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు

ఆధార్ కేంద్రం ప్రారంభించిన కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు

జీవీఎంసీ 79 వ వార్డు లంకెలపాలెం సబ్ రిజిస్టర్ కార్యాలయం ప్రాంగణంలో ఆధార్ కేంద్రం ను రౌతు శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనజీవనములో ఆధార్ అనేది అన్ని అవసరాలకు ఐడెంటి కార్డుగా చాలా ప్రాముఖ్యత కలిగినదని లంకెలపాలెం పరిధిలో ఆధార్ సెంటర్ లేక ఇచ్చటలో అనకాపల్లి గాని పరవాడ గాని అగనంపూడి వెళ్ళవలసి వచ్చేదని కావున లంకెలపాలెం లో ఆధార్ సెంటర్ పెట్టాలని సంబంధించిన అధికారులపై చాలాసార్లు ఒత్తిడి తెచ్చావని ఎట్టికేలకు ఆధార్ కేంద్రం లంకెలపాలెం కు వచ్చిందని కావున స్థానిక పుర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఏ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యేలు కార్పొరేటర్ ప్రభుత్వ రౌతు శ్రీనివాసరావు కృషితో ఆధార్ సెంటర్ లంకెలపాలెం లో కేటాయించడం జరిగిందని. ఈ ఆధార్ కేంద్రంలో కొత్త ఆధార్ నమోదు ఆధార్ వేలిముద్ర సరి చేయుట ఆధార మార్పులు ఆధార్ ఫోటో సరి చేయుట ఆధారం బదిలీలు ఆధార్ కి ఫోన్ నెంబరులు ఇంటి పేర్లు మరియు పేర్లు తప్పులుంటే సరి చేయబడును. లంకెలపాలెం ఆధార్ కేంద్రం ఇంచార్జ్ మువ్వల శ్రీనివాస్ సభ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 79 వ వార్డు టిడిపి అధ్యక్షులు కరణం జగదీష్ సీనియర్ టిడిపి నాయకులు నెల్లి శ్రీనివాసరావు దానబాల పైడికొండ అప్పల వరాహ నరసింహమూర్తి వడ్డాది శ్రీను స్థానిక నాయకులు బోండా అప్పారావు, యలమర్తి వెంకట్రావు, యలమర్తి నర్సింగరావు, చెలపరెడ్డి రామారావు, గుర్రం అప్పారావు (నాయుడు), మడక రమేష్, సూరపనేని శ్రీనివాసరావు, దాసరి గంగాధర్ ,ఎలమర్తి సత్యానందం, గంజి సురేష్ జనసేన పార్టీ మహిళా నాయకురాలు దాసరి జయలక్ష్మి మహిళలు కే వెంకటలక్ష్మి చొప్ప పావని మౌనిక గ్రామ పెద్దలు నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments