Friday, April 24, 2026
HomePoliticsAndhra Pradeshశంబర జాతర హుండీ ఆదాయం 25.47 లక్షల రూపాయలు

శంబర జాతర హుండీ ఆదాయం 25.47 లక్షల రూపాయలు

చదురు గుడిలో ఆరు హుండీల ద్వారా 18.47 లక్షల రూపాయల ఆదాయం
*వనం గుడి ఆరు హుండీల ద్వారా ఏడు లక్ష రూపాయలు
*ముడుపులు స్వయంగా విప్పిన పరిశీలించిన ఈ వో , బి శ్రీనివాస్
*అసిస్టెంట్ కమిషనర్ ఎస్ రాజారావు , పోలీస్ , సమక్షంలో హుండీలు లెక్కింపు
*కార్యక్రమంలో పాల్గొన్న కమిటీ చైర్మన్ , గ్రామ పెద్దలు ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతగాంచిన శంబర శ్రీ పోలమాంబ అమ్మవారి ప్రధాన జాతర , మారు జాతర ముగియడంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ హుండీల లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. దేవాదాయ ధర్మదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎస్ రాజారావు పర్యవేక్షణలో , ఆలయ కార్య నిర్వహణ అధికారి బి శ్రీనివాస్ సమక్షంలో పోలీస్, ధర్మకర్తల మండలి చైర్మన్, గ్రామ పెద్దల సమక్షంలో జాతర హుండీల ఆదాయం లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. చదురు గుడి, వనం గుడి హుండీ ఆదాయం 25 లక్షల 47 వేల 419 రూపాయలు ఆదాయం వచ్చింది.ముందుగా చదురు గుడిలో ఏర్పాటు చేసిన ఆరు హుండీలను లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. తదుపరి మధ్యాహ్నం వనం గుడిలో ఏర్పాటు చేసిన ఆరు హుండీలు గ్రామ పెద్దలు , పోలీస్ శాఖ సమక్షంలో తెరిచి లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. హుండీలో భక్తులు వేసిన ముడుపులను ఆలయ కార్య నిర్వహణ అధికారి బి శ్రీనివాస్ గ్రామ పెద్దల సమక్షంలో స్వయంగా విప్పి పరిశీలించారు. చదురు గుడిలో ఏర్పాటు చేసిన ఆరు హుండీల ద్వారా 18 లక్షల 47 వేల 354 రూపాయలు ఆధాయం రాగా, వనం గుడిలో ఏర్పాటు చేసిన ఆరు హుండీల ద్వారాఏడు లక్ష 65 రూపాయలు ఆదాయం వచ్చినట్టు ఆలయ కార్య నిర్వహణ అధికారి బి శ్రీనివాస్ తెలిపారు. అలాగే చదురు గుడి హుండీల ద్వారా బంగారం 17.500 మిల్లీ గ్రాములు ,వెండి 118 గ్రాములు వచ్చినట్టు తెలిపారు. అలాగే వనం గుడి హుండీల ద్వారా భక్తుల నుండి బంగారం 10.20 మిల్లీ గ్రాములు, వెండి 125 గ్రాములు వచ్చినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి బి శ్రీనివాస్ వెల్లడించారు. హుండీ ఆదాయం గత ఏడాది మే నెల 30 వ తేదీ నుండి ఈ ఏడాది జరిగిన ప్రధాన జాతర, మారు జాతర కలుపుకొని హుండీలు లెక్కింపు జరిగిందని ఈవో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులతో పాటు, చైర్మన్ నైదాన తిరుపతిరావు, మాజీ చైర్మన్లు పూడి దారి నాయుడు, వసంతల భాస్కరరావు, ఎంపిటిసి తీళ్ల పోలినాయుడు, ఉప సర్పంచ్ అల్లు వెంకటరమణ, గొట్టాపు కృష్ణ మూర్తితో పాటు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments