వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామాలలో నీటి ఎద్దడి నివారణకు బోర్లు మరమ్మతు నిమిత్తం క్రాస్ ప్రోగ్రాం ని గురువారం ప్రారంభించారు. మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో ఈ వాహనాన్ని ఎంపీపీ రాజారామ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి ఎద్దడి నివారణకు గ్రామాలలో మరమతుకురైన బోర్లను మంచినీటి పథకాలను గుర్తించి సరిచేయడం జరుగుతుందన్నారు. కాబట్టి ఆయా గ్రామాల్లో సర్పంచులు ఎంపీటీసీలు స్థానికులు ఎవరైనా సరే బోర్లు గానీ మంచినీటి పథకాలు గాని మరమత గురైతే వెంటనే తమ దృష్టికి కానీ క్రాష్ సిబ్బంది కానీ తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎండిఓకే అప్పారావు, పరిపాలనాధికారి గోపాలరావు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
మాడుగుల మండలంలో ప్రారంభమైన క్రాష్ ప్రోగ్రాం
RELATED ARTICLES
