అల్లూరి జిల్లా కొయ్యురు మండలంలోని కినపర్తి గ్రామంలో భారతీయ జనతా పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పార్టీ మండల ప్రధాన కార్యదర్శి-2 సెగ్గే సన్యాసిరావు తెలిపారు. బిజెపి కొయ్యూరు మండల అధ్యక్షుడు సంపరి శివకుమార్ అధ్యక్షతన నిర్వహించనున్న ఈ సమావేశానికి పార్టీ అల్లూరి జిల్లా అధ్యక్షురాలు మఠం. శాంతకుమారి, పార్టీ పాడేరు నియోజకవర్గం ఇన్చార్జి, ట్రైకర్ డైరెక్టర్ కూడా కృష్ణారావు, అరకు నియోజకవర్గ ఇన్చార్జి పాంగి రాజారావు, పాడేరు ఏఎంసి చైర్ పర్సన్ మంగతల్లి తదితరులతో పాటు పలువురు జిల్లాస్థాయి నేతలు హాజరు కానున్నారన్నారు. ఈ సమావేశంలో రానున్న స్థానిక సంస్థలు ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన విధివిధానాలు, పార్టీ బలోపేతం తదితర విషయాలపై చర్చించడం జరుగుతుందన్నారు. అలాగే కినపర్తి పంచాయతీతో పాటు మండలంలోని పలు గ్రామాలకు చెందిన పలువురు వార్డు సభ్యులు పేసా కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు జిల్లా అధ్యక్షురాలి సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు ఆయన తెలిపారు. కావున మండలంలో గల బిజెపి నేతలు కార్యకర్తలు వివిధ నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్నవారు అభిమానులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల కార్యదర్శి సన్యాసిరావు కోరారు.
కినపర్తి లో బిజెపి విస్తృతస్థాయి సమావేశం.
RELATED ARTICLES
