విద్యార్థుల్లో అవగాహన, ఆత్మవిశ్వాసం మరియు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే లక్ష్యంతో కొయ్యూరు కేజీబీవీ హాస్టల్ ఆవరణలో విజ్ఞాన సదస్సు ఘనంగా నిర్వహించారు. నెను సైతం చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు శాఖ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు జీవిత లక్ష్యాల సాధన, క్రమశిక్షణ, చదువు ప్రాముఖ్యత, మరియు సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని సూచించారు. యువతలో సానుకూల దృక్పథం పెంపొందితే భవిష్యత్తు బలంగా ఉంటుందని తెలిపారు.కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, కొయ్యురు ఎస్ఐ కోషోర వర్మ, మంప ఎస్ఐ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ ఇలాంటి విజ్ఞాన సదస్సులు గ్రామీణ విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తాయని చెప్పారు. చివరగా అతిథులను సన్మానించి కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు.
కొయ్యూరు కేజీబీవీ హాస్టల్‌లో విద్యార్థులకు విజ్ఞాన సదస్సు.
RELATED ARTICLES
