విద్యాభ్యాసం అందించిన పాఠశాల ఇప్పుడు లేనప్పటికీ ఆనాటి ఉపాధ్యాయిలూ ఇప్పుడూ లేనప్పటికి తమకు విద్యనిచ్చిన పాఠశాలను, నాటి తోటి విద్యార్థులను ఎప్పటికీ మరవమని చాటిచెప్పారు కె.కాలనీ మున్సిపల్ హైస్కూలు 1990-91 బ్యాచ్ పూర్వవిద్యార్థులు. సుమారు 35 ఏళ్ల క్రితం పాఠశాలను విడిచి వెళ్లిన విద్యార్థులు ఒక చోటకు చేరి ఆనాటి మధుర స్మృతులుగుర్తుచేసుకున్నారు. విశాఖపట్నం పోర్టు యాజమాన్యం అభివ్రుద్ధిలో భాగంగా సాంబమూర్తి నగర్ పోర్టు క్వార్టర్స్ ను మూడు దశాబ్దాల క్రితం తొలగించింది. దీంతో పాటు ఇక్కడ కంచరపాలెం, పోర్టు కాలనీ, డిజెల్ లోకో షెడ్ కాలనీ, మేఘాద్రి గెడ్డ కాలనీలకు దశాబ్ధాలుగా విద్యనంచించిన కె.కాలనీ మున్సిపల్ స్కూలు మనుగడ కోల్పోయింది. దేశ విదేశాల్లో స్థిరపడిన ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు ఆదివారం కంచరపాలెంలో ఒక కళ్యాణ వేదికలో ఆత్మియకలయిక ఏర్పాటు చేసుకుని పాఠశాలను పూర్వ విద్యా స్మృతులను నెమరవేసుకున్నారు. ఇక్కడి స్కూలులో 1981 నుంచి 1991 వరకూ విద్యనభ్యసించి దేశ విదేశాల్లో స్థిరపడిన విద్యార్థులు ఒకరినోకరు ఆత్మియంగా పలకరించుకుంటూ, ఆనాటి విద్యా వైభవాన్ని చాటుకున్నారు. ఈ సందర్బంగా తమకు విద్యాబుద్ధులు చెప్పిన ఆనాటి ఉపాధ్యాయులు కస్తూరి, సూర్యకాంతం, ఫజురుల్లా, ఇతర అమరులకు నివాళులర్పించారు. కెనడాలో స్థిరపడిన ఇక్కడి పూర్వ విద్యార్థి కొరివి సురేష్, ఐఐఎస్ అధికారి, దూరదర్శన్ విజయవాడ ప్రాంతీయ వార్త విభాగం అధిపతి షఫి మహమ్మద్, ప్రముఖ బిల్డర్ లక్ష్మణ రావు , కె.కోటపాటు, ఉపాద్యాయురాలు తారకేశ్వరీ, పాకలపాటి రాధ, రక్షణ రంగంతో పాటు , పలు విభాగాల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థిని, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
