టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, ప్రపంచ దేశాలకు శాంతిని అందించి జాతిపితగా ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అనకాపల్లి నియోజకవర్గం సంస్థాగత ఎన్నికల పరిశీలకులు గంటా నూకరాజు అన్నారు. మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్బంగా భీమిలిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు సమక్షంలో వర్ధంతి కార్యక్రమం జరిగింది. భీమిలి బీచ్ లో ఉన్న గాంధీ విగ్రహానికి గంటా నూకరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఆంగ్లేయుల పాలనలో నలిగిన భారతీయులకు విముక్తిని కల్పించిన గొప్ప దార్శనికుడు గాంధీ అని అన్నారు. శాంతి ద్వారా ఆంగ్లేయుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి ముచ్చెమటలు పట్టించిన మహాత్ముడు ప్రపంచానికే శాంతిని అందించారని అన్నారు. ఉప్పు సత్యాగ్రహం ద్వారా భారతీయుల్లో చైతన్యం రేకెత్తిoచి స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని అందించారని అన్నారు. ఇలాంటి మహనీయుడు మన దేశంలో పుట్టడం మన అదృష్టమని అన్నారు. మహాత్మా గాంధీ జీవితచరిత్రను ప్రతీ ఒక్క విద్యార్ది అవగతం చేసుకోవాలని గంటా నూకరాజు అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు
విశ్వశాంతి పితామహుడు మహాత్మా గాంధీ…!
RELATED ARTICLES
