విశాఖలోని పలు రైతు బజార్లలో పని చేస్తున్న పలువురు ఉద్యోగులకు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర స్థాయి అవార్డులు దక్కాయి. ఎం వి పి కాలనీ రైతు బజార్ ఎస్టేట్ అధికారి కె. వరహాలు, గోపాలపట్నం రైతు బజార్ ఎస్టేట్ అధికారి జి. ప్రసాద్, సీతమ్మధార రైతు బజార్ సహాయకుడు కె.సతీష్ కుమార్ లు గుంటూరులోని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిని గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రైతు బజార్ల సి ఈ ఓ మాధవి లత చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. రైతు బజార్ల నిర్వహణ, వినియోగదారులతో కలిసి బజార్ల అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు వీరికి ఈ అవార్డులు దక్కాయి. రైతు బజార్ల సిబ్బంది రాష్ట్ర స్థాయిలో అవార్డులు అందుకోవటం ఇదే మొదటి సారి కావడం విశేషం. తమకు రాష్ట్ర స్థాయిలో అవార్డులు రావటం తమ బాధ్యత ను మరింత పెంచాయని ఈఓ లు ప్రసాద్, వరహాలు, సహాయకుడు సతీష్ కుమార్ లు తెలిపారు.
