Tuesday, May 26, 2026
HomePoliticsAndhra Pradeshగాజువాకలో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు

గాజువాకలో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు

72వ వార్డు వుడా కాలనీలో కూడలిలో బిజేపి జిల్లా ప్రధాన కార్యదర్శి సిరసపల్లి నూకరాజు ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా బిజేపి రాష్ట్ర మీడియా పేనలిస్ట్ డాక్టర్ కరణంరెడ్డి నరసింగరావు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరించి , జెండా వందనం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ,అల్లూరి సీతారామరాజు,గౌతు లచ్చన్న వంటి ఎందరో మహనీయుల త్యాగాలను గుర్తు చేస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం 1950 సంవత్సరం జనవరి 26వ తేదీన అమల్లోకి వచ్చిందని అన్నారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం జనవరి 26ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలను కూడా నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు వరహాలరావు,జిసి నాయుడు,మాజీ కౌన్సిలర్ గొంతిన చినఅప్పారావు,ప్రసాద్ ,మండల అధ్యక్షులు మహేష్,రాజశేఖర్,తులసీదాస్,పైడిరాజు,శ్రీను తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments