Wednesday, April 22, 2026
HomePoliticsAndhra Pradeshఆర్ట్స్ కళాశాల మైదానంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ పరేడ్

ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ పరేడ్

77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో రిపబ్లిక్ డే పరేడ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇన్‌ఛార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ ముఖ్య అతిథిగా హాజరై పోలీసు దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అంతకు ముందు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డి. నరసింహ కిషోర్‌కు పోలీసు బృందం గౌరవ వందనం సమర్పించింది. పరేడ్ కమాండర్‌గా జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ పి. సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరేడ్‌ను ఇన్‌ఛార్జి కలెక్టర్ పరిశీలించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రగతిపై సందేశం ఇచ్చారు.
పోలీసు, ఉమెన్ పోలీస్, ట్రాఫిక్, హోంగార్డ్స్, ఎన్‌సీసీ, రెడ్ క్రాస్ తదితర విభాగాల కంటింజెంట్లు క్రమశిక్షణతో పరేడ్‌లో పాల్గొని ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, రుడా చైర్‌పర్సన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామమూర్తి, ఆర్డీవోలు, న్యాయమూర్తులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి వాతావరణంలో ఘనంగా ముగిశాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments