Wednesday, April 22, 2026
HomePoliticsAndhra Pradeshప్రజారక్షణలో పోలీసుల పాత్ర చాలా కీలకం

ప్రజారక్షణలో పోలీసుల పాత్ర చాలా కీలకం

పోలీసులకు అభినందన సత్కారం ప్రజారక్షణలో పోలీసుల పాత్ర చాలా కీలకమని, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు భద్రత కల్పించడంలో పోలీసులు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారని మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు అన్నారు. మార్నింగ్ కాఫీ క్లబ్ అధ్వర్యంలో తాడిమళ్ళ వారి కంప్లెక్స్ లో శుక్రవారం ట్రాఫిక్ సిఐ, ఎస్సై, అర్ ఎస్సై, లకు అభినందన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రాఫిక్ సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజారక్షణ, సమాజ పరిరక్షణలో పోలీస్‌ అందించే సేవలు ఎనలేనివని, ఇటీవల కాలంలో భీమవరం పట్టణంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిందని, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేస్తున్నప్పటికీ కొద్దిపాటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ప్రజల సహకరిస్తే ట్రాఫిక్ సమస్య తీరుతుందన్నారు. క్లబ్ కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్,కోట్ల నాని, పిఆర్ఓ భట్టిప్రోలు శ్రీనివాసరావు, చవ్వా శ్రీనివాస సుబ్బారావు మాట్లాడుతూ పోలీసులకు ప్రజలు సహకరిస్తే సమాజ రక్షణ జరుగుతుందని, సంక్రాంతి పర్వదినాల్లో ప్రతి నిమిషం ట్రాఫిక్ అంతరాయం కలుగుతూనే ఉన్నప్పటికీ ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ పోలీసులు అందించిన సేవలు మరువలేనివని, వంతెన మీద మోటర్ సైకిల్లకు మాత్రమే అనుమతి ఇవ్వడం చాలా మంచి పని అని అభినందించారు. అనంతరం ట్రాఫిక్ సిఐ శ్రీనివాస్, ఆర్ఎస్సైలు కోనేటి రావు, ఎస్సైలు ఎస్ సత్యసాయి, టివిజి రాజు, సిహెచ్ మురళీకృష్ణ లను సత్కరించారు. కార్యక్రమంలో కార్మురి సత్యనారాయణ మూర్తి,కొత్త శ్రీనివాస్,పరుచూరి నాగేశ్వరావు, కనగర్ల రామకృష్ణ, కనగర్ల కిషోర్, జూలూరి రాజా, బొండాడ మనీష్, కంచర్ల భాస్కరరావు గుప్తా, పులవర్తి రామకృష్ణ, మానేపల్లి రవి చిన్నారావు, తటవర్తినారాయణ, కురిశెట్టి నాని, బొండాడ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments