Wednesday, April 22, 2026
HomePoliticsAndhra Pradeshరోడ్డు మద్యలో ఉన్న విద్యుత్ స్తంభం మార్పు

రోడ్డు మద్యలో ఉన్న విద్యుత్ స్తంభం మార్పు

జీవీఎంసీ మధురవాడ జోన్ పరిధిలోగల 5 వ వార్డు కొమ్మాది జంక్షన్ నుండి శివశక్తి నగర్ వెళ్లే మార్గంలో రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభం ఉండడం వలన అటువైపు ప్రయాణించే వాహనదారులకు నిరంతరం ట్రాఫిక్ సమస్య ఏర్పడడం తో పాటు ప్రమాద బారిన పడడం జరుగుతుండడం తో పలువురు ఈ సమస్యను స్థానిక కార్పొరేటర్ అయిన మొల్లి హేమలత దృష్టికి తీసుకు వెళ్ళగా వెంటనే స్పందించి సంబంధిత జీవీఎంసీ అధికారుల ద్వారా ఈ సమస్య పరిష్కారం దృష్ట్యా సుమారు 70 వేల జీవీఎంసీ నిధులు మంజూరు చేయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని మధురవాడ ఈపీడీసీఎల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అల్లు శైలజ ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ సిబ్బంది రోడ్డు ప్రక్కకు మార్పు చేయడం జరిగింది. సమస్య పై వెంటనే స్పందించిన స్థానిక కార్పొరేటర్ హేమలత పనితీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ సుధాకర్, వర్క్ ఇన్స్పెక్టర్ కృష్ణ, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments