Wednesday, April 22, 2026
HomePoliticsAndhra Pradesh5వ వార్డులో ఘనంగా నారా లోకేష్ బర్తడే వేడుకలు

5వ వార్డులో ఘనంగా నారా లోకేష్ బర్తడే వేడుకలు

విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసిన కార్పొరేటర్ మొల్లి హేమలత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్య ఐటి,శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఈరోజు ఐదవ వార్డ్ పరదేశి పాలెం లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు మొల్లి హేమలత పాల్గొని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు తమ సొంత నిధులతో ఏర్పాటు చేసిన పుస్తకాలు, పెన్నలును పంచిపెట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఉన్నత విద్యావంతులు రాష్ట్ర అభివృద్ధికై నిరంతరం శ్రమిస్తున్న నారా లోకేష్ బాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, ఈరోజు యువ నాయకులు పుట్టినరోజు అయిన రాష్ట్ర సంక్షేమం కోసం శ్రమిస్తూ వేడుకలు చేసుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా దావోస్ లో రాష్ట్రంలో కార్పొరేట్ దిగ్గజ సంస్థలు పెట్టుబడేలే లక్ష్యంగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారని, ముఖ్యంగా తన పుట్టినరోజు వేడుకలు ఆడంబరంగా చేయకుండా సేవా కార్యక్రమాలు చేయాలని తన అభిమానులకు ఆయన పిలుపునివ్వడం అభినందనీయమని, కావున ఈరోజు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు అందజేశామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో యువత అధ్యక్షులు కొండపు రాజు, పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బోర అప్పల సూరిబాబు రెడ్డి, సురేష్, సత్యాల కృష్ణ, స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments