Wednesday, April 22, 2026
HomePoliticsAndhra Pradesh25న శ్రీ సత్య సాయి రన్ అండ్ రైడ్

25న శ్రీ సత్య సాయి రన్ అండ్ రైడ్

శుక్రవారం హాజరైన వారందరికీ టీ-షర్టు, బిబ్ పంపిణీ ఈ నెల 25న ఉదయం 5 గంటలకు ఆర్ కె బీచ్ కాళీమాత గుడి దగ్గర ప్రారంభం కాబోయే శ్రీ సత్య సాయి రన్ & రైడ్ ప్రారంభం కానుంది. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ కార్యక్రమానికి ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్నవారికి టీ-షర్టు, బిబ్ నంబర్‌ల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ఎంవీపీ కాలనీ సెక్టర్–8లోని శ్రీ సత్య సాయి ప్రేమసదన్ మందిరంలో శ్రీ సత్య సాయి సేవా సంస్థల విశాఖ జిల్లా అధ్యక్షులు పి.ఆర్.ఎస్.ఎన్. నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విశాఖ మహా నగర ప్రజలు, యువత, రన్నర్స్, సైక్లిస్ట్స్ లు రిజిస్టర్ చేసుకున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ సత్య సాయి రన్ అండ్ రైడ్ – 2026 కార్యక్రమానికి ఇప్పటికే నమోదైన వారు తమ టీ-షర్టు, బిబ్ నంబర్‌ను ఈ నెల 23, 24 తేదీల్లో (శుక్రవారం, శనివారం) ఎంవీపీ కాలనీ సెక్టర్–8లోని శ్రీ సత్య సాయి ప్రేమసదన్ మందిరం (శ్రీ సత్య సాయి విద్యావిహార్ స్కూలు ప్రాంగణం) లో తీసుకోవాలన్నారు.
టీ-షర్టు మరియు బిబ్ నంబర్‌లను ఈ నెల 23, 24 తేదీల్లో (శుక్రవారం, శనివారం) ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు, అలాగే సాయంత్రం 2:30 గంటల నుండి 6 గంటల వరకు అందజేస్తామన్నారు. శ్రీ సత్య సాయి రన్ & రైడ్ – 2026 కార్యక్రమంలో పాల్గొనడానికి ఇప్పటికే నమోదు చేసుకున్నవారు, టీ-షర్టు మరియు బిబ్ తీసుకునే సమయంలో తమతో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సత్య సాయి సిటీ సేవా సమితి కన్వీనర్ బి. సాయికుమార్, విశాఖ జిల్లా సత్య సాయి యువత సమన్వయకర్త సాయి ప్రశాంత్, ఇతర పదాధికారులు,సత్య సాయి యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. మరింత సమాచారం కోసం…!

శ్రీ సత్య సాయి సిటీ సేవా సమితి కన్వీనర్ బి. సాయికుమార్(8885469869 ),విశాఖ జిల్లా శ్రీ సత్య సాయి యువత సమన్వయకర్త సాయి ప్రశాంత్(9666891234) లను సంప్రదించగలరు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments