సాధారణంగా రాజకీయ నాయకుల పుట్టినరోజులు భారీ సభలు, హంగులతో జరుపుకుంటారు. కానీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు మాత్రం సేవా కార్యక్రమాలకు కేరాఫ్‌గా మారిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర భవిష్యత్తే లక్ష్యంగా పనిచేసే నాయకుడిగా లోకేష్ తన పుట్టినరోజున కూడా దావోస్‌లో పెట్టుబడులు ఆకర్షించడంలో నిమగ్నమయ్యారని తెలిపారు.
రాజమహేంద్రవరం నగరంలో లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆర్భాటాలకు దూరంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టారు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వద్ద చెట్లు నాటి పచ్చదనానికి నాంది పలికారు. రైతు బజార్‌లో జూట్ బ్యాగ్‌లను పంపిణీ చేసి “సే నో టు ప్లాస్టిక్” సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.
గ్రీన్ రాజమండ్రి – ఆరోగ్య రాజమండ్రి లక్ష్యంగా దీర్ఘకాలిక ఆలోచనతో కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా, యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా లోకేష్ పనిచేస్తున్నారని అన్నారు.
ఆడంబరాలకు దూరంగా సేవా కార్యక్రమాలు… లోకేష్ పుట్టినరోజు ప్రత్యేకత
RELATED ARTICLES
