Wednesday, April 22, 2026
HomePoliticsAndhra Pradeshకేజీబీవీ వసతి గృహాన్ని తనిఖీ చేసిన అసిస్టెంట్ కలెక్టర్

కేజీబీవీ వసతి గృహాన్ని తనిఖీ చేసిన అసిస్టెంట్ కలెక్టర్

విద్యార్థినులతో ముఖాముఖి విద్యా ప్రమాణాలపై ఆరా ,పాడేరు మండలం లగ్జపల్లి గ్రామంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని అసిస్టెంట్ కలెక్టర్ కె సాహిత్ సందర్శించారు. వసతి గృహంలోని వసతులు, విద్యార్థినులకు అందుతున్న భోజన సదుపాయాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ​ఈ సందర్భంగా ఆయన 9వ తరగతి విద్యార్థినులతో ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థినుల చదువు తీరును, వారికి పాఠ్యాంశాలు అర్థమవుతున్న విధానాన్ని, స్కూల్లో ముస్తాబు కార్యక్రమం నిర్వహణ పై అడిగి తెలుసుకున్నారు.విద్యా ప్రమాణాలు విద్యార్థినుల నైపుణ్యాన్ని పరీక్షించేందుకు కొన్ని ప్రశ్నలు వేసి, వారి సమాధానాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థినులకు దిశానిర్దేశం చేశారు.​వసతుల పరిశీలన వసతి గృహంలోని గదులు, శుభ్రతను పరిశీలించారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని వార్డెన్ మరియు సిబ్బందిని ఆదేశించారు. ​సమస్యల పరిష్కారం విద్యార్థినులకు ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, వసతి గృహ సిబ్బంది మరియు ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. గిరిజన ప్రాంత విద్యార్థినులకు నాణ్యమైన విద్య, రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా అసిస్టెంట్ కలెక్టర్ ఉపాధ్యాయులకు సిబ్బందికి పునరుద్ఘాటించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments