జూన్ నాటికి పొల్లూరు కొత్త యూనిట్ ద్వారా విద్యుత్ వేసవిలో విద్యుత్ ఉత్పత్తికి అన్ని యూనిట్లు ఏపీ జెన్ కో చీఫ్ ఇంజనీర్ కె.వి రాజారావు సీలేరు, జనవరి 21, జయ జయహే : రాష్ట్రానికి నిరంతరం విద్యుత్ సరఫరాను అందించడంలో ఏపీ జెన్ కో సీలేరుకాంప్లెక్స్ లో ఉన్న జలవిద్యుత్కేంద్రాలు తోడ్పాటునందిస్తున్నాయని ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్స్ చీఫ్ ఇంజినీరు కె.వి.రాజారావు అన్నారు. బుధవారం సీలేరు వచ్చిన ఆయన వేసవిలో ఉత్పత్తికి ఇబ్బందులు లేకుండా చేసేందుకు ఏపీ జెన్‌కో ఇంజినీర్లు, అధికారులు. సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వేసవిలో నిరంతరం విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు సీలేరు కాంప్లెక్స్ పలు జలాశయాలతో బాటు బలిమెల జలాశయంతో కలిపి సుమారు 70 టీఎంసీలు నీటినిల్వలు ఉన్నాయన్నారు.. డొంకరాయి మినహా. మాచ్ ఖండ్ 17 మెగావాట్ల మూడు యూనిట్లు, 23 మెగావాట్ల సామర్థ్యం గల మూడు యూనిట్లు, సీలేరులో 60 మెగావాట్ల ఉత్పత్తి చేసే నాలుగు యూనిట్లు, పొల్లూరు లో 115 మెగావాట్ల ఉత్పత్తి చేసే నాలుగు యూనిట్లు నిర్మాణం చేపట్టి 50 ఏళ్లు దాటినప్పటికీ సామర్థ్యాన్ని మించి వాటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో గ్రిడ్ విఫలమైన సమయంలో తిరిగి విద్యుత్తును అందించడానికి సీలేరు విద్యుత్ కీలకంగా మారిందన్నారు. కేంద్రం నుంచి అనుమతులు రాగానే కొత్త ప్రాజెక్టు పనులు.. సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ లో నూతనంగా నిర్మించపోయే పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి స్టేజ్ వన్ అనుమతులు రాగానే ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తామని చీఫ్ ఇంజనీర్ అన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి సెంట్రల్ అటవీ శాఖ నుంచి వచ్చేనెల స్టేజ్ వన్ మరియు టూ . జిల్లా కలెక్టర్ ద్వారా ఎన్ ఓ సి అనుమతులు వస్తాయని వచ్చిన వెంటనే పనులను ప్రారంభిస్తామన్నారు. ఆయన వెంట ఎస్ ఈ జాకీర్ హుస్సేన్, ఇంచార్జీ ఈ ఈ జైపాల్, ఏఈఈ సురేష్ ఉన్నారు.
సీలేరు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ కి వచ్చేనెలలో అనుమతులు
RELATED ARTICLES
