ఉపాధి చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలి కేంద్ర ప్రభుత్వం పటిష్టంగా అమలు చేయాలనుకుంటున్న జి రామ్ జి ఉపాధి చట్టాన్ని గ్రామస్థాయిలో పటిష్టంగా అమలు చేయాలని సీటు నాయకులు నంబూరు షణ్ముఖరావు తెలిపారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు కనిపిస్తున్నాయని దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉపాధి కూలీలుగా మనపైనే ఉందని ఆయన అన్నారు. ఈ మేరకు గోడ పత్రికను ఆవిష్కరించారు. ఉపాధి హామీ చట్టం గ్రామీణ స్థాయిలో అమలు చేయడం వల్ల వ్యవసాయ కూలీల వలస బాటలు తగ్గు ముఖం పట్టాయని ఉపాధి హామీ చట్టం ద్వారా గ్రామీణ స్థాయిలో మౌలిక సదుపాయాలను ప్రజలకు కల్పించాలని తెలిపారు, బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉండేందుకు ఈ పథకం పేరును జీ రాంజీ పథకంగా పేరు మార్చారని అన్నారు ఈ కార్యక్రమంలో బగాది వాసుదేవరావు, యు లక్ష్మణరావు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
