నిట్ట నిలువునా మోసం చేసి ద్రోహం చేసారు,ఆర్థిక పరపతిని దారుణంగా దిగజార్చారు,రూ. 16,600 మేర డ్వాక్రా రుణాలు తగ్గించారు,రూ. 470 కోట్ల వరకు మహిళల పొదుపు తగ్గు ముఖం,నాబార్డు నివేదికలో బాబు నిర్వాకం తేటతెల్లం,18.36 శాతం మేర మహిళా సంఘాలు ఎన్ పీఏకి,జగన్ పాలనలో ఏ, బీ గ్రేడ్ లలో మహిళా సంఘాలు,బాబు హయాంలో సీ, బీ గ్రేడ్ లుగా పడిపోయాయి,రూ. 7,500 కోట్ల మేర సున్నా వడ్డీ బకాయితో బాబు గారడీ,సంక్రాంతి పండుగ సంస్కృతి, సంప్రదాయాలకు తిలోదకాలు,క్యాసినోలు, పేకాట క్లబ్ లు, అశ్లీల నృత్యాలకు అడ్డాగా మార్చారు,వైసీపీ నేతలకు వార్నింగ్ లు ఇచ్చే హోమ్ మంత్రి ఏం చేస్తున్నట్లో..?అసాంఘికాలతో రెచ్చపోవాలనేలా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటనలు,వైసీపీ ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కల్యాణి ధ్వజం,రాష్ట్రంలో మహిళల పరిస్థితి దారుణంగా దిగజారిందని, చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి పేద మహిళలను నిట్టనిలువనా మోసం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ, వైసీపీ మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కల్యాణి మండిపడ్డారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, డ్వాక్రా మహిళలను నేనే కనిపెట్టానని చంద్రబాబు పదే పదే చెప్పుకుంటారు కానీ, మహిళల పరపతిని దారుణంగా బాబు దిగజార్చారని ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు రూ. 16,600 కోట్ల మేర రుణాలు మంజూరు తగ్గించేసారని ఆవేదన వ్యక్తం చేసారు. సున్నా వడ్డీలకు గుండు సున్నా చుట్టేశారని, ఈ మేరకు నాబార్డు నివేదికలో మహిళల రుణాల పరపతి తగ్గిందని సుస్పష్టంగా పేర్కొనడమే నిదర్శనమని వివరించారు. బ్యాంకు రుణాల మంజూరు రూ. 16,600 కోట్ల తగ్గించడమే కాకుండా, రూ. 470 కోట్ల మేర మహిళల పొదుపు తగ్గిపోయిందంటే చంద్రబాబు పాలన చేతకాని తనాన్ని ఉదహరిస్తోందన్నారు. రాష్ట్రంలోని అక్కా, చెల్లెమ్మలను కోటీశ్వీరులను, లక్షాధికారులను, పారిశ్రమిక వేత్తలను చేస్తామని చెప్పి చంద్రబాబు ఊరూ వాడా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాక నిలువునా మోసం చేసారని ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ హయాంలో పురోగమనంలో ఉన్న మహిళా సంఘాలు, బాబు హయాంలో తిరుగోమనంలోకి చేరిపోయాయని మండిపడ్డారు. 2014 ఎన్నికల సమయంలో డ్వాక్వా రుణాల మాఫీతో పాటుగా, సున్నా వడ్డీ ఎగ్గొట్టడంతో ఏ, బీ గ్రేడ్ తో ఉన్న సంఘాలు, సీ, డీ గ్రేడ్ లుగా దిగజారిపోయాయని వరుదు కల్యాణి కన్నెర్ర చేసారు. రాష్ట్రంలో 18. 36 శాతం మహిళా సంఘాలు ఎన్ పీఏ లుగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేసారు. జగన్ సీఎం అయ్యాక ఆసరా, చేయూతల ద్వారా సరైన సమయంలో సున్నా వడ్డీ రుణాలు కూడా మంజూరు చేయడంతో ఆర్థిక తొడ్పాటును ఆందచేసారని గుర్తు చేసారు. ఎన్ పీఏల శాతం అప్పట్లో తగ్గడం లేకుండా పెరిగిందని గుర్తు చేసారు. మహిళలు తామ కాళ్లపై తాము నిలబడాలన్న సంకల్పంతో వారు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయం చేసేందుకు హిందూస్తాన్ లీవర్, అముల్, ఐటీసీ వంటి సంస్థలతో జగన్ ఒప్పందం కుదుర్చుకుని తొడ్పాటును అందచేసారని వరదు కల్యాణి గుర్తు చేసారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల పొదుపు శాతం రూ. 479.11 కోట్లు తగ్గిపోయిందని నాబార్డు నివేదించిందని, బ్యాంక్ రుణాలు రూ. 16,607 కోట్ల తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేసారు. సీఎంగా జగన్ ఉన్న సమయంలో ఒక్కో పొదుపు సంఘానికి రూ. 8.8 లక్షలు రుణాలు ఇచ్చేవారని, బాబు సీఎం అయ్యాక, 6.43 లక్షల మాత్రమే లోన్ మంజూరు చేసి మహిళ పరపతిని దిగజార్చారని వరుదు కల్యాణి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో సున్నా వడ్డీని 3 లక్షల నుంచి 10 లక్షలు చేస్తామని హామీ ఇచ్చి, చివరకు రూ. 7,500 కోట్ల మేర సున్నా వడ్డీ బకాయిని పేరుకుపోయేలా చేయడమే చంద్రబాబు గారడీ అని వరుదు కల్యాణి ఎద్దేవా చేసారు.అశ్లీలత, అంసాఘిక కార్యక్రమాలతో సంక్రాంతి పండుగా..మహిళ ఆర్థిక భరోసాను తగ్గించడం, రక్షణ లేకుండా వదిలేయడమే కాకుండా సంక్రాంతి సంబరాల పేరిట క్యాసినోలు, జూదాలకు అడ్డాగా, అశ్లీల నృత్యాలుగా కేపిటల్ గా మార్చేసారని వరదు కల్యాణి ఆరోపించారు. గోవా వంటి నగరాల్లో జరిగే పాశ్చాత్య సంస్కృతిని రాష్ట్రానికి తీసుకువచ్చి తెలుగుదేశం పార్టీని కాస్తా తెలుగు డర్టీ పార్డీగా, కూటమి ప్రభుత్వం కాస్తా, క్యాసినో పాలనగా మార్చేసారని, మంచి ప్రభుత్వం కాదు.. మద్యం ప్రభుత్వమని, ఆర్టీజీఎస్ కాక రికార్డింగ్ డ్యాన్స్ ప్రభుత్వమని అర్థం వచ్చేలా సాగించారని వరుదు కల్యాణి అభివర్ణించారు. తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేలా సంక్రాంతి పండుగ ఉంటే, కుటుంబ సమేతంగా చేసుకునే పండుగని కాస్తా తెలుగు ప్రజలకు తెగులు పుట్టేలా ప్రభుత్వం నిర్వాకం చేసిందని, కూటమి హయాంలో జూదరులు, పోకిరీలు పండుగా సంక్రాంతిని మార్చేసారని, సంస్సృతి విలువలను దిగజార్చారని దుయ్యబట్టారు. మహిళ హోమ్ మంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇలాంటి దుస్థితిని చూసి ప్రజలు మనోవేదకు గరవుతున్నారని ఆక్షేపించారు. వైసీపీ పార్టీ నేతలు ఏ నేరం చేయకపోయినా సరే హోమ్ మంత్రి అనిత తమ పార్టీ నేతలకు వార్నింగ్ లు ఇస్తుంటారని, కానీ క్యాసినోలు, రికార్డింగ్ డ్యాన్స్ లు, పేకాడ క్లబ్ లు చేయించిన నిర్వాహకులపై ఏం చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. అసాంఘిక కార్యక్రమాలపై అడ్డుకట్ట వేయకుండా కూటమి ప్రభుత్వం వారికి అండగా నిలిచిందని విమర్శించారు. చంద్రబాబు, భువనేశ్వరిల పిలుపు మేరకు గ్రామాల్లో పండుగను జరుపుకునేందుకు మూడు వేల మంది కార్లలో వచ్చి క్యాసినోలు సాగించారని ఆరోపించారు. తెలుగుదేశంతో పాటుగా కూటమి పార్టీలోని ప్రజాప్రతినిధులు కమీషన్లు తీసుకుని అసాంఘిక కార్యక్రమాలను ప్రొత్సహించారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తను సాల్మన్ ను టీడీపీ గూండాలు హత్య చేస్తే వారిపై కేసు పెట్టకుండా నడిరోడ్డుపై నడిపించారని, పీక కోస్తే కేసు పెట్టకుండా జగన్ అభిమానులు బర్త్ డే మేక పీక కోస్తే ఎలా కేసు పెట్టారని ప్రశ్నించారు.సంక్రాంతి సంబరాలు అంటే పేకాట, కోడి పందెంలతో పరిమితం చేయకూడదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారని, అంతకుమించి అపరిమితితో అసాంఘిక కార్యకలాపాలతో రెచ్చిపోయాలే వ్యవహరించాలని పవన్ పరోక్షంగా సంకేతాలిచ్చారని ఆరోపించారు. సంక్రాంతి సమయంలో రూ. 1800 కోట్ల మేర మద్యంను బెల్ట్ షాపుల ద్వారా కూడా తాగించి, ప్రొత్సహించారన్నారు. కోడి పందెంలు, క్యాసినోలు, పేకాట క్లబ్ ల వద్ద పబ్లిక్ గా మద్యం విక్రయించాలు జరిపించేలా ప్రభుత్వం ప్రొత్సహిచిందని, పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో ఆడ్డూ ఆపూ లేకుండా సాగిందని మండిపడ్డారు.
డ్వాక్రా మహిళలకు బాబు టోకరా
RELATED ARTICLES
