జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నరవ , పెందుర్తి మండలం. 1996 – 97 సంవత్సర పదోతరగతి
పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక , పాఠశాల ఆవరణలో జరిగింది. పాఠశాల ఆవరణలో ఉన్న సరస్వతీ దేవికి , వివేకానంద విగ్రహాలకు పూలమాలవేసి , కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా మరణించిన తోటి స్నేహితులకు ఘన శ్రద్ధాంజలి నివాళులు అర్పించారు. డిగ్రీలు కాదు డిగ్నిటీ ముఖ్యమన్నారు , నేటికీ 30 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా అందరూ కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇంతమంది కలవడానికి ముఖ్య కారణం “స్త్రీ “ముందడుగు వేస్తే జయించలేనిది ఏదీ లేదు అనడానికి చక్కటి ఉదాహరణ పైడికలని కొనియాడారు . గత సంవత్సరము అందర్నీ కలపాలనే ప్రయత్నం నేడు అందరి కలయికతో నెరవేరిందని పైడికల ఆనందాన్ని వ్యక్తిపరిచారు , పైడికల కృషికి గౌరీ శంకర్ , నాగమణిల తోడ్పడుట వలన ఆత్మీయ కలయిక నేడు జరిగిందని చిన్ననాటి స్నేహితులందరూ అభినందనలు తెలియజేశారు. అందరం సోదరా సోదరీ భావంతో మెలగాలి. పేరుకే ” స్నేహం ” కాకూడదు, పేరు నిలిచేలా ఉండాలి మన స్నేహం, మనం మరణించిన మన ” స్నేహం ” శాశ్వతంగా నిలిచిపోవాలి ఏ బంధానికైనా తొలి పరిచయం స్నేహమని పేద , ధనిక బేధం లేనిది , స్వార్థం లేనిది వివక్షత చూపునది స్నేహం ఎన్నో బంధాలకు వారధిగా నిలిచేది స్నేహం. ఒకరికి ఒకరు ఆప్యాయతంగా ఆలంగనం చేసుకొని రోజు ఆనందంగా గడిపారు. సమయం ముగిస్తున్న చివరిలో మనలో ఎవరికీ ఏ కష్టం ఉన్న ,వచ్చిన అందరు తోడుగా కుటుంబంవలే నిరుద్దామని అందరూ అంగీకరానికి వచ్చారు. ఆనాటి జ్ఞాపకాలను తలుచుకొని ఉప్పొంగన నవ్వులు హరివిల్లులై ముగిసింది పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక.
డిగ్రీలు కాదు డిగ్నిటి ముఖ్యమన్న పూర్వ విద్యార్థులు.
RELATED ARTICLES
