Friday, April 24, 2026
HomeEditorialsరిపబ్లిక్ డే వేడుకల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్ష.

రిపబ్లిక్ డే వేడుకల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్ష.

జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్  77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్వహించాలని జిల్లా అధికారులకు జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ​ఈ నెల జనవరి 26న నిర్వహించనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల, పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ వేడుకలను జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలను అట్టహాసంగా, క్రమశిక్షణతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
​గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగబోయే ​వేదిక మరియు పరేడ్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ (మైదానం)లో వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, పోలీసు దళాల గౌరవ వందనం,
​శకటాల ప్రదర్శన ప్రభుత్వ పథకాలను ప్రతిబింబించేలా వివిధ శాఖల ఆధ్వర్యంలో ఆకర్షణీయమైన ఎగ్జిబిషన్ స్టాళ్లను, శకటాలను సిద్ధం చేయాలని సంబంధిత శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
​సాంస్కృతిక కార్యక్రమలు దేశభక్తిని చాటిచెప్పేలా పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్,విద్యాశాఖ అధికారులకు సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments