సచివాలయ, పీహెచ్సి రికార్డుల తనిఖీ. పట్టాదార్ పాస్ బుక్ పొందిన రైతులతో ముఖా ముఖి.అల్లరి జిల్లా, హుకుంపేట మండలంలోని పలు గ్రామాలు పర్యటించి పట్టాదార్ పాస్ బుక్స్ పంపిణీపై ఆరా తీసి, లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించి జిల్లా ఇన్చార్జి జాయింట్ కలెక్టర్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీపూజా. హుకుంపేట మండలంలోని పలు గ్రామాలు విస్తృతంగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సేవలు, కార్యాలయాల పనితీరును పరిశీలించడమే లక్ష్యంగా సుడిగాలి పర్యటన చేసారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతుల భూములు రి సర్వే నిర్వహించి, రాజముద్ర తో కూడిన పట్టాదారు పాసుబుక్కులను ముద్రించి, అర్హులైన లబ్ధిదారులందరకు పట్టాలు పంపిణీ చేసిన,
రైతులతో ముఖాముఖి నిర్వహించి పట్టాల పంపిణీలో అవకతవకలు ఏమైనా జరిగాయా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీపై రైతులతో నేరుగా మాట్లాడారు. పాస్ పుస్తకాలు సకాలంలో అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించి, రెవెన్యూ సేవలపై వారి అభిప్రాయాలను సేకరించారు ఉప్ప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది పనితీరుపై సమీక్షించారు. ఆసుపత్రిలో మందుల నిల్వలు, డాక్టర్ల, సిబ్బందికి సంబందించిన హాజరు పట్టిక, రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించరాదని సిబ్బందిని హెచ్చరించారు.బాకూరు గ్రామ సచివాలయాన్ని సందర్శించి, సిబ్బంది పనితీరుపై సమీక్షించారు. సచివాలయ రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ పథకాలు అమలు పై అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడటమే కాక వారికి ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని చూడటం మన బాధ్యత అని అన్నారు.ఈ పర్యటనలో స్థానిక మండల తహసీల్దార్, ఎంపీడీఓ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
తిరుమణి శ్రీపూజా సుడిగాలి పర్యటన
RELATED ARTICLES
