ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – అల్లూరి సీతారామరాజు జిల్లా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జాతీయ పశు వ్యాధి నియంత్రణ పధక సౌజన్యంతో జిల్లాలో తేది 19-01-2026 నుండి 31-01-2026 వరకు ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వారు తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ వారు కలెక్టర్ ఛాంబర్ నందు దీనికి సంబందించిన పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పాడి రైతుల సంక్షేమం మరియు పశువుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ఈ ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమం 2026 జనవరి 19 నుండి జనవరి 31 వరకు (పక్షోత్సవాలుగా) జిల్లా వ్యాప్తంగా జరుగుతుందని పేర్కొన్నారు.ఈ శిబిరాలలో లభించు ఉచిత సేవలయిన అన్ని రకాల పశువైద్య చికిత్సలు, పశువులకు వ్యాధి నిరోధక టీకాలు, గర్భకోశ వ్యాధులకు ప్రత్యేక చికిత్సలు, పశువుల గర్భధారణ పరీక్షలు
నట్టల నివారణ మందుల ఉచిత పంపిణీ, పాడి పశువుల శాస్త్రీయ యాజమాన్యంపై రైతులకు అవగాహన సదస్సులు అందించడం జరుగుతుందని,జిల్లాలోని పాడి రైతులందరూ తమ సమీపంలోని పశువైద్యశాల లేదా రైతు సేవా కేంద్రాలలో వారిని సంప్రదించి, ఈ ఉచిత శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ బి ఎస్ నంద్, పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్లు ఎమ్ కరుణాకర్ రావు,జయరాం, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ సృజన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
RELATED ARTICLES
