Wednesday, April 22, 2026
HomeNewsబచ్చయ్య పేట మండల సర్వసభ్య సమావేశం

బచ్చయ్య పేట మండల సర్వసభ్య సమావేశం

ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యలును, అధికారులకు పలు సర్వసభ్య సమావేశాలలో తెలపడం జరుగుతుందని అయిన అధికారులు సమస్యలు పరిష్కారం కొరకు కృషీ చేయలేదని నాయకులు అసహనం వ్యక్తం చేశారు.బచ్చెయ్య పేట మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ డి. నాగేశ్వరి దేవి అధ్యక్షతన నిర్వహించారు. జడ్పీటీసీ రాంబాబు మాట్లాడుతూ వెంకన్న ఆలయం భూమి 70 ఎకరాలు కాగా నేడు 40 ఎకరాలకు చేరిందని సిస్తుకు తీసుకోని తానకా పెట్టి సిస్తూ చెల్లించలేదని, దేవస్థానం భూమి రీ సర్వే లో సర్వే చెయ్యాలని, ప్రోటో కాల్ పాటించమని, అంగన్వాడీ ల వద్ద రన్నింగ్ వాటర్ అందించడానికి ఎన్ని సెంటర్స్ లో అవసరం గుర్తించి తెలియచేయమని అంగన్వాడీ పి ఓ మంగతుయారు ని కోరారు. జడ్పీ నిధులతో రన్నిoగ్ వాటర్ అందిస్తామని తెలిపారు. నారాయణ మూర్తి మాట్లాడుతూ వడ్డాది లో రీ సర్వే సక్రమంగా జరగలేదని, అభ్యన్తరాలూ ఉన్నాయని వెంకన్న కొండ దిగువున అక్రమణకు గురవుతుందని సర్వే చేయాలనీ అనకాపల్లి నుండి రాజాం మీదుగా మండలం ని కలుపుతూ బస్సు లు తిప్పాలని, కోరారు. పోలేపల్లి సర్పంచ్ సీతా పైడి నాయుడు మాట్లాడుతు మా గ్రామం లో చెరువు లు ఆక్రమణ లు తొలగించాలని కోరారు. ఆర్ భీమవరం, పెదపూడి సర్పంచ్ లు మాట్లాడుతు మళ్ళాo, పంగిడి బస్సు లు పునర్థి చాలని కోరారు, రైతు వద్ద ధాన్యం తరలించడానికి జి పి ఎస్ వాహనాలు దొరకక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు.దేవర అప్పారావు మాట్లాడుతూ వైజాగ్ నుండి బచెయ్యపేట బస్సు ను కొండపాలెం పొడిగించామని కోరారు.ఎస్ ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ సైబర్ క్రైమ్ పట్ల జాగ్రతలు తీసుకోవాలని. వాహన తనిఖీ లలో ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకోవద్దని, గంజాయి కి యువత అలవాటుపడ్డారని వారి ని మార్చే దిశగా ప్రయత్నం చెయ్యడానికి సహకరించగలరని, బాల్య వివాహాలు అరికట్టాలి కోరారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ శివప్రసాద్ నారాయణ, జడ్పీటీసీ దొండ రాంబాబు, తహసీలదార్ ఎం లక్ష్మి. ఎస్ ఐ శ్రీనివాసరావు, వివిధ శకాల అధికారులు, సర్పంచ్ లు ఎంపీటీసీలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments