Saturday, April 18, 2026
HomeNewsడిప్యూటీ సీఎం కు చీపురు గూడెం గ్రామవాసుల వినతిపత్రం..

డిప్యూటీ సీఎం కు చీపురు గూడెం గ్రామవాసుల వినతిపత్రం..

ఏలూరు /నల్ల జర్ల, జయ జయహే..

ఐ ఎస్ జగన్నాధపురం పర్యటన ముంగించు కుని రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కు తిరుగు ప్రయాణం అయిన
డిప్యూటీ సీ ఎం పవన్ కళ్యాణ్ వాహనం ను హైవే లోని నల్లజర్ల మండలం చీపురు గూడెం వద్ద అభిమానులు అడ్డు పడి కాన్ వాయిని నిలిపి వేశారు.గోపాలపురం ఎస్ సి నియోజకవర్గం లోని చీపురు గూడెం వద్ద గవర్నమెంట్ కాలేజీ కావాలి అని స్థానికులు  పవన్ కళ్యాణ్ కు అర్జీ ఇచ్చారు. ఇక్కడ కాలేజీ ఏర్పాటు చేస్తే ఎస్ సి విద్యార్థులకు ఉపయోగం అని గ్రామస్తులు తెలిపారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించి అధి కారులతో సంప్రదించి చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ హటాత్తు పరి నామం పట్ల అధికారులు బిత్తిర పోయారు. ముందు గా సమాచారం లేక.. సుమారు వంద కిలోమీటర్లవేగం తో వెళుతున్న కాన్వాయిని అపి విజ్ఞాపన పత్రం ఇవ్వడం సాహసం అని పలువురు పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments