- చేనేత, హస్త కళలకు ఆర్థిక దన్ను
- రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత
- విశాఖ సమ్మిట్ లో 3 చేనేత, హస్త కళల స్టాళ్లు ఏర్పాటు
విశాఖపట్నం : జయ జయహే : చేనేత, హస్త కళాకారులకు ఆర్థిక వెన్నుదన్ను లభించేలా ఆయా ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ సదుపాయం కల్పిస్తున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విశాఖ సీఐఐ సదస్సు 2025లో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ లో చేనేత, జౌళి శాఖలకు చెందిన మూడు స్టాళ్లను రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణితో కలిసి మంత్రి ఎస్.సవిత శుక్రవారం ప్రారంభించారు. ముందుగా హస్తకళా స్టాల్ ను మంత్రులు సవిత, గుమ్మడి సంధ్యారాణి సందర్శించారు. కళాకారులు రూపొందించిన కళారూపాలను పరిశీలించారు. అనంతరం రెండు చేనేత స్టాళ్లను సందర్శించారు. ఓడీ- ఓపీ అవార్డులు గెలుచుకున్న ఉత్పత్తులను పరిశీలించారు. వాటితో పాటు తో ఈ ఈ ఏడాది ఓడీ-ఓపీ అవార్డుల కోసం ఎంపిక చేసిన 34 ఉత్పత్తులను తిలకించారు. ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ, రాష్ట్రంలో చేనేత, హస్త కళలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. చేనేత వస్త్రాలు, హస్త కళారూపాల విక్రయాలు పెరిగేలా రాష్ట్ర స్థాయిలో పాటు జాతీయ స్థాయిలో ఎగ్జిబిషన్లు, బజార్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విశాఖ సీఐఐ సదస్సులో ప్రత్యేక పెవిలియన్ ఏర్పాటు చేసి చేనేత, హస్త కళల స్టాళ్లు మూడు ఏర్పాటు చేశామన్నారు. చేనేత, హస్త కళాకారుల పట్ల సీఎం చంద్రబాబుకు ఉన్న ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనమన్నారు. చేనేతలకు 15 శాతం సబ్సిడీతో నూలు అందిస్తున్నామన్నారు. 50 ఏళ్లు నిండిన నేతన్నలకు పెన్షన్లు అందజేస్తున్నామన్నొరు. రాష్ట్రంలో అన్నో ప్రధాన నగరాల్లోనూ చేనేత, హస్త కళల బజార్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చేనేత, హస్త కళాకారులకు ఆర్థిక ఉన్నతి కల్పించడంతో పాటు గౌరవప్రదమైన జీవనం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత వెల్లడించారు. అంతకుముందు సీఐఐ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన నృత్య కళా ప్రదర్శనలను మంత్రి సంధ్యారాణితో కలిసి మంత్రి సవిత తిలకించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం మాధవి, చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, లేపాక్షి ఎండీ విశ్వ, జిల్లా బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖాధికారులు పాల్గొన్నారు.
విశాఖ సమ్మిట్ లో 3 చేనేత, హస్త కళల స్టాళ్లు ఏర్పాటు
RELATED ARTICLES
