Tuesday, April 21, 2026
HomeNewsగ్రంథాలయ నూతన కమిటీ ప్రమాణస్వీకారం.

గ్రంథాలయ నూతన కమిటీ ప్రమాణస్వీకారం.

జంగారెడ్డిగూడెం, జయ జయహే
స్థానిక గ్రంధాలయం ను గ్రేడ్. 1 స్థాయి గ్రంధాలయంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ హామీ ఇచ్చారు.శాఖా గ్రంధాలయం నూతన కమిటీ ప్రమాణస్వీకారకార్యక్రమాన్ని గురువారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రంధాలయం సేవలు విద్యార్థులు ఉపయోగించు కోవాలని చూచించారు. పోటీ పరీక్షలకు అవసరమైన కాంపిటేటివ్ బుక్స్ అందుబాటులో ఉంచాలని కోరారు. దాతలసహాకారం తో అవసరాలు తీర్చుకోవాలని పేర్కొన్నారు.
గ్రంధాలయ చైర్మన్గా నియమితులైన కొప్పాక శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇది గ్రేడ్ 3 గ్రంథాలయంగా ఉందని, గ్రేడ్ వన్ గా జనాభాను బట్టి మార్చాలని తెలిపారు. అలాగే ఈ ప్రాంతం పెద మధ్య తరగతి కిచెందిన ఎస్సీ ఎస్టీ బిసి విద్యార్థినీ విద్యార్థులు ఎక్కువగా కాంపిటీటివ్ పరీక్షలకు గాని పీజీ కోర్సులకు కానీ ఈ గ్రంథాలయం మీద ఆధారపడి నేర్చుకుంటున్నారనివివరించారు. గ్రేడ్. 2 మున్సిపాలిటీగా వున్న ఈ సెంటర్ నుంచి గత సంవత్సరం రూ 50 లక్షల మేర నిధి పన్నుల రూపంలో జిల్లా గ్రంధానికి వెళ్లిందని దానిలో కొంత గ్రంధాలయం అభివృద్ధి కి వెచ్చించాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కృష్ణ కిషోర్, బిజెపి పట్టణ అధ్యక్షులు తాటికొండ సుధాకర్, జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ మేక ఈశ్వరయ్య , బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు వేమూరి శ్రీనివాసు, పి.వి.రామలక్ష్మి, , అర్జుల మురళి , క్షత్రియ కార్పోరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్ర రాజు తెదేపా నేతలు పెనుమర్తి రాంకుమార్, రావూరి కృష్ణ , ఏ ఎం సి వైస్ చైర్మన్ మారిశెట్టి సత్యనారాయణ, లైబ్రేరియన్ దుర్గారావు పాల్గొన్నారు.  కాగా గ్రంధాలయం డైరెక్టర్ లు గా ఇనుముల వెంకటపాపారావు, దోసూరి సుబ్బారావు, చింతలశ్రీనివాస్, గుళ్ల పూడి కామరాజు,సహా య కార్యదర్సులు గంగిరెడ్ల దుర్గ, ముత్యాల దుర్గా మహా లక్ష్మి బాధ్యత లు స్వీకరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments