యలమంచిలి, జయ జయహే న్యూస్ : పట్నంలోని స్టేషన్ రోడ్డు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా వాసవి క్లబ్, వనిత క్లబ్ యలమంచిలి ఆధ్వర్యంలో పాఠశాలలో గల విద్యార్థులందరికీ నోటు పుస్తకంలో పెన్నలు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్ఎన్ఎల్. డి భవాని చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వాసవి క్లబ్, వనిత క్లబ్ ఆర్థిక సహాయంతో వస్తువులు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
