యలమంచిలి, జయ జయహే న్యూస్ : మండలంలోని దిమిలి గ్రామ మునందు అవగాహనా ర్యాలీని దిమిలి ప్రాధమిక ఆరోగ్యకేంద్ర సిబ్బంది డాక్టర్ బాలష్రావణి ఆద్వర్యములో నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి అధిక ఆకలి, అధిక దాహము అధిక మూత్రము, బరువు తగ్గుట, గాయములు త్వరగా మనకపోవుట వంటి లక్షణములు ఉంటే మధుమేహవ్యాధిగా బావించి సమీప దిమిలి ప్రాధమిక ఆరోగ్యకేంద్రమునకు వచ్చి వ్యాధి నిర్దారణ చేసుకోవాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ జరిగితే మందులు ఉచితముగా ఇస్తారని తెలిపారు. అదే విధముగా ఈ కార్యక్రమములో ఆరోగ్య విస్తరణాధికారి యస్.యస్.వి.యన్.రాజు (శ్రీను.శిలపరశెట్టి) అధిక క్రొవ్వులు కలిగిన ఆహారము, వేపుల్లను తగ్గించాలని, పీచు కలిగిన పండ్లు ఆకు కూరలు అదేవిధముగా నేరుగా చక్కెర వాడకమును తగ్గించాలని, పరిమితముగా భుజించటము, శారీరక శ్రమపెంచుకోవాలని అన్నారు. అధిక బరువును నియంత్రించు కోవాలని, మద్యపానము, దూమపనము వంటి చెడు అలవాట్లుకు దూరముగా ఉండాలని ప్రతి రోజూ ఉదయం అరగంట సాయంత్రము అరగంట వ్యాయాయము చేసిన యెడల ఈవ్యాధి బారిన పడకుంటా ఉండుటకు అవకాశము ఉన్నదని తెలిపారు. పిదప మధుమేహ ముప్పు – అందరికీ ఉందని చెప్పు అనే నినాదముతో ర్యాలీని నిర్వహించారు. స్కూల్ స్పీచ్ ద్వారా పాటశాల విద్యార్ధులకు మధుమేహవ్యాదిపై ఆవాహన కల్పించారు. ఈ కార్యక్రమములో ఆరోగ్య పర్యవేక్షకులు సీహెచ్.ధనరాజు, వైద్యసిబ్బంది, ఆశా కార్యకర్త కనక లక్ష్మి పాల్గొన్నారు.
