ఇంటికి వెళ్లి పరామర్శ
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న *31 వ వార్డు డాబాగార్డెన్ లో నివసిస్తున్న సీనియర్ వైసీపీ కార్యకర్త బాణాల కృష్ణ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు దక్షిణ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉండటం, ఈ కారణంగా కంటి చూపు మందగించడంతో, అతను పరిస్థితిని అవార్డు ప్రెసిడెంట్ బాపు ఆనంద్ వాసుపల్లి గణేష్ కుమార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. స్పందించిన గణేష్ కుమార్ సీనియర్ పార్టీ కార్యకర్త బాణాల కృష్ణ ఇంటికి వెళ్లి అతనిని పరామర్శించారు*.
వైద్య ఖర్చుల నిమిత్తం అతనికి ఐదువేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాణాల కృష్ణ కుటుంబానికి తాను అండగా ఉంటానని తెలిపారు. తక్షణ వైద్య ఖర్చులు నిమిత్తం ఐదువేల రూపాయలను అందించడం జరిగిందని, *భవిష్యత్తులో అతనికి తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. పార్టీ పటిష్టతకు, బలోపేతానికి కష్టపడి పనిచేసిన పరిస్థితి కార్యకర్తను పార్టీ గౌరవిస్తుందని, పార్టీలో వారికి సముచిత స్థానం కల్పిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రతి కార్యకర్తకు తాను భరోసా ఇస్తున్నట్లు తెలియజేశారు*.
