Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradesh“గ్లోబల్ స్టార్ రాంచరణ్ పుట్టినరోజు వేడుకలు”

“గ్లోబల్ స్టార్ రాంచరణ్ పుట్టినరోజు వేడుకలు”

శ్రీరామాలయంలో ప్రత్యేక పూజలు
` మెగా వైద్య శిభిరం
` పారిశుధ్య కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ

ప్రముఖ యువ నటుడు, మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రాంచరణ్ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం విజయనగరం జిల్లా చిరంజీవి యువత,అంజనీ పుత్ర చిరంజీవి ప్రజా సేవా సంఘం మరియు అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు (బాలు) ఘనంగా నిర్వహించారు. రాంచరణ్ గోత్ర నామాలతో విజయనగరం కాలనీలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, 42వ డివిజన్ కామాక్షి నగర్ అయ్యన్నపేట జంక్షన్ వద్దనున్న మున్సిపల్ నడక మైదానంలో క్వీన్స్ ఎనఆరఐ హాస్పిటల్ వారి సౌజన్యంతో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి ముఖ్యఅతిధిగా హాజరైన డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ ఎ. తిరుపతిరావు, సామాజిక కార్యకర్త త్యాడ రామకృష్ణారావు మాట్లాడుతూ… ప్రపంచంలోనే మెగాఫ్యామిలీ అభిమానులు సేవల్లో ముందుంటారని, దీనికి నిదర్శనం ప్రపంచ నలుమూలలా మెగాభిమానులు ఉన్నారన్నారు. 42వ డివిజన్లో ఉన్న సుమారు 20 మంది పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రములను ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు సిహెచ్ రమణ, కోశాధికారి కోట్ల ఈశ్వరరావు, డిప్యూటీ గవర్నర్ తాడ్డి ఆదినారాయణ, క్లబ్బు ఉపాధ్యక్షుడు పి అప్పలరాజు, క్లబ్బు ఉప కోశాధికారి ఐ అప్పలరాజు, జాలివాకర్ వై నలమహారాజు, క్లబ్బు పెద్దలు చిరంజీవి యువత ప్రతినిధులు కోట్ల సత్యనారాయణ, కె రమేష్, రాంబాబు, శ్రీను, జనార్ధన్ మాస్టారు, అప్పన్న, నరేష్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments