విశాఖపట్నం జయ జయహే: విశాఖలోని ఐటీ సెజ్ ఈస్ట్ కాలిఫోర్నియాగా మారనుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. ఋషికొండ ఐటి సెజ్ హిల్ నెంబర్ 2 లో 200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఫినోమ్ గ్లోబల్ హెచ్ ఆర్ సంస్థ విస్తరణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు ఆసక్తి కనపరుస్తున్నారని చెప్పారు. ఐటీ హబ్ గా విశాఖ మారనుందని తెలిపారు. అనంతరం సంస్థ కో ఫౌండర్ హరి బైరెడ్డి మాట్లాడారు. తమ సంస్థ విస్తరణకు ఎంతగానో సహకరిస్తున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రఖ్యాత సంస్థలకు మానవ వనరుల నిపుణులను తయారుచేసి అందిస్తున్నామని చెప్పారు. ఈ విస్తరణ ద్వారా మరో రెండు వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. త్వరలో రెండవ పేజ్ విస్తరణ పనులు కూడా చేపట్టనున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీ శ్రీ భరత్, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఫినాం సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
భూమి పూజ చేసిన మంత్రి నారా లోకేష్

