గాజువాక బిజేపి కార్యాలయంలో రాష్ట్ర మీడియా పేనలిస్ట్ మరియు గాజువాక ఇంచార్జ్ కరణంరెడ్డి నరసింగరావు ఒక ప్రకటన విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరాన్ ఇజ్రాయల్ మధ్య యుద్ధం జరుగుతున్న సందర్భంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మన భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో
పెట్రోల్ పై వున్న ఎక్సైజ్ డ్యూటీ రూ.13/- నుండి 3/- కి అదేవిధంగా డీజిల్ పై వున్న ఎక్సైజ్ డ్యూటీ రూ.10/- పూర్తిగా తగ్గింపు చేసి దేశ ప్రజలకు శ్రీరామనవమి పండుగ రోజున శుభవార్త చెప్పారని అన్నారు. దీని వలన రవాణా ఖర్చులు తగ్గి ,దేశంలో ప్రజలకు మంచి జరుగుతుంది అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన
ప్రధాని నరేంద్ర మోదీ కు ధన్యవాదాలు తెలిపారు.
