గ్రామదేవత, పట్టణ ప్రజల ఆరాధ్యదైవం శ్రీ నూకాలమ్మ తల్లి మారువారం ఉత్సవాన్ని జయప్రదం చేయాలని ఉత్సవ కమిటీ సభ్యులు గంటా నూకరాజు, మారోజు సత్యప్రసాద్ , శిల్లా కరుణాకర్ రెడ్డి, గాడు యస్వంత్, ఉసిరికల బంగార్రాజు లు కోరారు.
మార్చి 17 నుండి 20వ తారీకు వరకు భీమిలి శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఉత్సవాలు అందరి సహకారంతో ఘనవిజయం చేసామని, అదేవిధంగా ఈనెల 25వ తేది బుధవారం ఆలయ పూజారులు, ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించు మారువారం ఉత్సవాన్ని జయప్రదం చేసి తల్లి యొక్క ఆశీర్వాదాలు పొందాలని అన్నారు. ఈ సందర్బంగా భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు, పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు గంటా రవితేజ, భీమిలి ఇంచార్జ్ కోరాడ రాజబాబు, వైసిపీ భీమిలి ఇంచార్జ్ మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను ), జనసేన ఇంచార్జి పంచకర్ల సందీప్, బిజెపి పార్టీ ఇంచార్జి జె. వి. కైలాస్ రెడ్డి, పోలీస్ కమీషనర్ శంకబ్రత భాగ్చి, డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఎస్. మణికంఠ, అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఎస్. అప్పలరాజు, ఆర్డీఓ కానల సంగీత్ మాధుర్, ఎమ్ఆర్ఓ పైల రామారావు, ఎంపిడిఓ వి. నరసింహారావు, జోనల్ కమీషనర్ మేకల విజయ్ కుమార్, భీమిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ టి. తిరుమల రావు, ఆలయం ఈఓ పద్మ తో పాటు తదితర అధికారులను, ప్రజాప్రతినిధులను ఉత్సవ కమిటీ సభ్యులు స్వయంగా కలసి ఆహ్వానించారు.
శ్రీ నూకాలమ్మ తల్లి ఉత్సవాన్ని జయప్రదం చేయండి..
RELATED ARTICLES
