Saturday, May 2, 2026
HomeNewsజనతా వారధి ద్వారా సమస్యలకు పరిష్కారం

జనతా వారధి ద్వారా సమస్యలకు పరిష్కారం

కేఎన్ఆర్

బిజేపి జనతా వారధి కార్యక్రమం ద్వారా గాజువాక తహసీల్దార్ శ్రీనివాసరావుకి వినతి పత్రం అందజేసిన బిజేపి రాష్ట్ర మీడియా పేనలిస్ట్ మరియు గాజువాక ఇంచార్జ్ కరణంరెడ్డి నరసింగరావు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ బిజేపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సూచనల మేరకు ప్రజల సమస్యలను బిజేపి జనతా వారధి కార్యక్రమం ద్వారా సంబంధిత అధికారులకు తెలియజేసి వారి సమస్యలను పరిష్కారానికి బిజేపి తరపున కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా బానోజీతోట సర్వే నెంబర్ 86లో ఇనాం భూముల రైతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం టిడిపి రాష్ట్ర అధ్యక్షులు మరియు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు కృషితో జీఓ నెంబర్ 45 వచ్చిందని తెలిపారు. దాని ప్రకారం రెవెన్యూ అధికారులు సర్వే చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో బాదిత రైతులు నాగులకొండ కృష్ణచైతన్య , మద్ది బద్రీకృష్ణ , బిజేపి నాయకులు రామస్వామి, నాయుడు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments