Sunday, May 3, 2026
HomePoliticsAndhra Pradeshకుటుంబ వివాదంపై వైసీపీ నీచ రాజకీయాలు

కుటుంబ వివాదంపై వైసీపీ నీచ రాజకీయాలు

టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్
ఒక మహిళ కుటుంబ సమస్యను వైసీపీ నేతలు రాజకీయంగా మలచడం దారుణమని తెలుగుదేశం పార్టీకి చెందిన ఎస్సీ నాయకులు విమర్శించారు. స్థానిక ఆనం రోటరీ హాల్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
పాలచర్లకు చెందిన మహిళ కుటుంబంలో నెలకొన్న వివాదంలో అనవసర జోక్యం చేసుకుని వైసీపీ నేతలు నీచ రాజకీయాలకు దిగారని ఆరోపించారు. బాధిత కుటుంబం మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును సంప్రదించగా, ఆయన మాట్లాడిన మాటలను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తెలిపారు.
జగన్ పాలనలో దళితులు, మహిళలపై అనేక దాడులు, అన్యాయాలు జరిగాయని గుర్తుచేశారు. ప్రస్తుతం ఆ విషయాలను మరిచి రాజకీయ లాభాల కోసం ఈ ఘటనను వాడుకుంటున్నారని విమర్శించారు.
దళితుల అభివృద్ధికి ఆదిరెడ్డి కుటుంబం చేసిన సేవలను చెడగొట్టేందుకు కుట్ర జరుగుతోందని నేతలు ఆరోపించారు. వ్యక్తిగత, కుటుంబ సమస్యలను రాజకీయాల్లోకి లాగడం సరికాదని సూచించారు.
ఈ సమావేశంలో కప్పల వెలుగు కుమారి, చాపల చినరాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments