Monday, May 4, 2026
HomePoliticsAndhra Pradeshక్యాన్సర్ ని తొలి దశలోనే గుర్తిస్తే నివారణ సులభతరం

క్యాన్సర్ ని తొలి దశలోనే గుర్తిస్తే నివారణ సులభతరం

క్యాన్సర్ వ్యాధి ని మొదటి దశలోనే గుర్తిస్తే నివారణ సులభమని గ్లోబల్ క్యాన్సర్ ఆసుపత్రి మేనేజర్ శ్రీనివాస్ తెలియజేశారు.
ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యుల సంఘం ( ఆర్.ఎం.పి) ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ప్రేమ సమాజం లో నిర్వహించిన వైద్య విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్లోబల్ క్యాన్సర్ ఆసుపత్రి మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలో గమనిస్తే నివారించ వచ్చన్నారు. వ్యవస్థాపక అధ్యక్షులు జంగం జోషి మాట్లాడుతూ గ్రామీణ వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు క్యాన్సర్ అవగాహన సదస్సు లు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మమ్ముల తిరుపతిరావు, కారుణ్య క్యాన్సర్ ఫౌండేషన్ సెక్రటరీ కోన ప్రకాష్, అనకాపల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, అలక రాజు, వీరభద్రరావు, ఏ.కె. మలాకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments