Tuesday, April 21, 2026
HomePoliticsAndhra Pradeshచైత్ర పౌర్ణమి మహోత్సవాలకు సహకరించండి

చైత్ర పౌర్ణమి మహోత్సవాలకు సహకరించండి

మాధవధార కంచరపాలెం, ఇందిరానగర్ 1 కొండపైన కొలువై ఉన్న శ్రీసుబ్రమణ్య స్వామివారి దేవాలయంలో చైత్ర పౌర్ణమి మహోత్సవాలు ఈ నెల 24 నుండి ఏప్రిల్ 2 వరకు విజయవంతంగా నిర్వహించేందుకు మహా విశాఖ నగరపాలక సంస్థ అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందించాలని మహా విశాఖ నగరపాలక సంస్థ మాధవధార జోనల్ కమిషనర్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము కు దేవాలయం కమిటీ గౌరవాధ్యక్షులు గొండు సీతారాం సారధ్యాన కమిటీ సభ్యులు సోమవారం వినతి పత్రం అందించారు,ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము మాట్లాడుతూ దేవాలయ కమిటీ అభ్యర్థన మేరకు మహోత్సవాలు నిర్వహించే అన్ని దినాల్లోనూ పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా చర్యలు చేపడతామని అన్నారు,అలాగే వేసవి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని భక్తులకు త్రాగునీటి సమస్య లేకుండా చర్యలకు సహకరిస్తామని అన్నారు,అలాగే వీధిలైట్లు ఇతర సమస్యలపైన తమవంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
అనంతరం దేవాలయ కమిటీ గౌరవాధ్యక్షుడు గొండు సీతారాం,అధ్యక్షుడు బైరి చిరంజీవి లు మాట్లాడుతూ స్థానిక వార్డ్ ప్రజల సహాయ సహకారాలు,మహావిశాఖ నగరపాలక సంస్థ అధికారులు,సిబ్బంది సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేస్తామని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments