దేవకీ కళ్యాణమండపం
క్లాప్ కొట్టిన సీనియర్
జర్నలిస్ట్ శంకర రావు
సినిమా నిర్మాణం సవాళ్ల తో కూడు కున్న సాహస కార్యక్రమం అని
అన్ని వర్గాలవారికీ నచ్చే విధంగా సినిమా నిర్మించి విడుదల చేయడం ఎంతో టాలెంట్తో కూడు కున్నదని ప్రముఖ వ్యాపార వేత్త చామర్తి శ్రీరాములు (టెక్స్ మో )అన్నారు. గురువారం శ్రీ వర్మ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ద్వితీయచిత్రం “దేవకీ కళ్యాణంమండపం ”
పోస్టర్స్ ఆవిష్కరణలో
ముఖ్య అతిధి శ్రీ రాములు పాల్గొన్నారు.నూతన దర్శకుడు ప్రసాద్ రాజు ఎంతో శ్రమించి
మొదటి సినిమా అనన్య విడుదల చేశారని పేర్కొన్నారు.
నూతన సినిమా
ప్రారంభ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
మరో అతిధి సిటీ కేబుల్ ఎం డి, సిటీ ప్రోపర్టీస్ అధినేత పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూఏజెన్సీ మెట్ట ప్రాంతాల వాణిజ్య కేంద్రం జంగారెడ్డిగూడెం సినిమా హబ్ గా కూడా గుర్తింపు పొందుతున్నదని హర్షం వ్యక్తం చేశారు. గతం లో ఈ పరిసరాల్లో పలు సినిమాలు నిర్మాణం జరుపుకున్న నేపథ్యంవున్నా
అనన్య వంటి
చిన్న బడ్జెట్ లో సినిమాను నిర్మించిగుర్తింపు పొందిన ఘనత డైరెక్టర్ ప్రసాద్ రాజుకు దక్కుతుందన్నారు..డైరెక్టర్ ప్రసాద్ రాజు( వర్మ )మాట్లాడుతూ
అనన్య సినిమా సక్సెస్ తో బాధ్యత పెరిగిందన్నారు. హార్రర్, కామెడీ నేపథ్యంలో దేవకీ కళ్యాణ మండపం
కొత్త వారు ప్యాడింగ్ ఆర్టిస్టులతో
నిర్మాణం చేస్తున్నామన్నారు.
మార్చ్ నెల చివరి లో మొదలు పెడ్తామని డిసెంబర్ లో రిలీజ్ కు ప్లాన్ అన్నారు.
………..
దేవకీ కళ్యాణ మండపం చిత్రానికి ముహూర్తం షాట్
…………….
ఈ సందర్బంగా దేవకీ కళ్యాణ మండపం ముహూర్తం షాట్ కు సీనియర్ జర్నలిస్ట్ కె ఎస్ శంకర రావు క్లాప్ కొట్టగా ప్రసాద్ రాజు చిత్రీ కరించారు.
ఈ కార్యక్రమంలో
తిరుమల శెట్టి సత్తి బాబు
హీరోయిన్లు సుకన్య, శాలిని సహాయనటీ నటులు
సుష్మ, హిమ బిందు,
సీనియర్ నటుడు
పోల్నాటి దుర్గా ప్రసాద్,
రాజ్ కుమార్, శ్రీనివాస్, ప్రసాద్,
తదితరులు పాల్గొన్నారు.
