Home Politics Andhra Pradesh 52 బియ్యం బస్తాలు వితరణ

52 బియ్యం బస్తాలు వితరణ

0

విజయనగరం జిల్లా సంతపేట లో వేంచేసియున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్య అన్న ప్రసాద వితరణకు శ్రీ వాసవి చారిటీ గ్రూప్ వారు 60 వేల రూపాయలు విలువ చేసే 52 బియ్యం బస్తాలు మంగళవారం వితరణ చేసారు. దేవస్థానం పాలకమండలి సభ్యులకు ఈ బియ్యం బస్తాలు అందజేశారు. ఈ సందర్బంగా చారిటీ గ్రూప్ అధ్యక్షులు ఆలవెల్లి శేఖర్ మాట్లాడుతూ జిల్లా నలుమూలలు నుండి అమ్మవారు దర్శనం కోసం నిత్యం తరలి వచ్చే భక్తుల అన్న ప్రసాదానికి మా వంతు సహాయంగా బియ్యం అందజేసినట్లు చెప్పారు.చారిటీ గ్రూప్ గత 5 ఏళ్ళుగా 50 కార్యక్రమంలు నిర్వహించినట్టు తెలిపారు. విద్య, వైద్యం, వివాహం కోసం ఎవరు ఇబ్బందులు పడకుండా చారిటీ గ్రూప్ అండగా నిలుస్తుందన్నారు. కార్యదర్శి డిమ్స్ రాజు మాట్లాడుతూ సభ్యుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమంలు చేయగలుగుతున్నట్లు వివరించారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలు, దేవాలయంల నిర్మాణం కోసం చారిటీ గ్రూప్ సహకారం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి సముద్రాల నాగరాజు,దేవస్థానం పాలక మండలి సభ్యులు కాపుగంటి ప్రకాష్, రవ్వా శ్రీనివాస్, కుమ్మరిగుంట శ్రీనివాసరావు, వెత్సా సత్యనారాయణ మూర్తి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా విశిష్ట సేవలు అందిస్తున్న శ్రీ వాసవి చారిటీ గ్రూప్ సభ్యులను అభినందిస్తూ దేవస్థానం ప్రధాన అర్చకులు మహేష్ వేద ఆశీర్వచనం చేసారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు విజ్జపు విజయ్ కుమార్, నానాజీ, కుమార్, కృష్ణారావు, కందుల సంతోష్, మురళీ కృష్ణ, గుంపిన నారాయణరావు, బీవీపీఎస్.రామయ్య, మాటూరు మురళీ కృష్ణ, కట్టమూరి మధు తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version